కార్తీక మాసం

కార్తీక మాసం

Thursday 11 June 2015

చక్కని పాత పాట:


1986లో విడుదలైన ఈ సినిమా ఎలా వుంటుందో తెలియదు,కానీ ఆ రోజుల్లో మేము ఇంటర్మీడిఏట్ చదువుతున్న రోజుల్లో రేడియోలో నీరాజనం అనే కార్యక్రమం వచ్చేది. అందులో విన్నది. సంగీతం బాగా నచ్చేసింది.సాహిత్యం కూడా బాగుంటుంది.ఇక జానకమ్మగారి గాత్రం గురించి చెప్పేది ఏముంది.సంగీతం మాత్రం లక్ష్మికాంథ్ ప్యారేలాల్ అని తెలుసు. ఈమద్య నదియ సినిమాలు చూసినపుడు ఈ పాట వెంటనే స్పురణకి వచ్చింది.కానీ సాహిత్యం అంత త్వరగా గుర్తుకు రాలేదు.వెతకగా వెతకగా మన గూగులమ్మ ఇచ్చేసింది.నాకు నా స్నేహితులకి కూడా ఆరోజుల్లో ఈ పాట చాలా ఇష్టం.మరిపుడు వారికి గుర్తుందో లేదో తెలియదు. చూస్తే గుర్తుకువస్తుందేమో చూడాలి.అన్నట్లు ఈ సినిమా పేరు చెప్పలేదుకదూ "ప్రేమ దేవత"అనే అనువాద చిత్రం. పాట చాలా బాగుంటుంది.కావాలంటే మీఊ ఓసారి వినండి,చూడండి.కాస్త లిప్ సింక్ కాలేదనుకుంటాను.ఐనా చూడండి.

Wednesday 10 June 2015

బేబీ ఆలూ ధం బిర్యానీ:





లక్ష్మీస్ మయూఖ కూడా వంటల పోస్టు పెట్టేసిందోచ్.అవునండీ ఈ రోజు నేను నా స్వంత వంట అంటే(నా ప్రయోగం)అనమాట.అదే చేశా.ఎప్పుడో ప్రయత్నించి విజయవంతమైనతరువాత ఇన్నాళ్ళకు నా బ్లాగులో పెట్టాలనిపించింది.చదివిన వాళ్ళు మీ స్పందనలు తెలియ చేస్తారనుకుంటా.ఏముంది ఓ కామెంట్ పడేస్తే సరి.

   ఇక తయారు చేసే విషయానికి వస్తే,

  తయారీ విధానం: 1/2 బాస్మతి బియ్యంలో లవంగాలు ఓ 5,దాల్చినచెక్క చిన్న ముక్కలు ఓ 3,యాలకులు ఓ2,బిర్యానీ ఆకు,పుదీనా కొంచెం,జాపత్రి 3 రేకులు ఓ పావు స్పూన్ ఉప్పు వేసి బియ్యాన్ని సగమే ఉడికించుకోవాలి.

    దానికంటే ముందు చేయవలసినది చిన్న చిన్న ఆలూలు దొరుకుతాయ్ వాటినే బేబీ ఆలూలు అంటారు. వాటిని ఉడికించి పొట్టు తీసి వాటికి ఫోర్క్తో కొంచెం గుచ్చి,వాటికి 2కప్పుల పెరుగు,జాజికాయ పొడి 2చిటికెలు,లవంగాలు,చెక్క,యాలకుల పొడి ఓ1/2 స్పూన్,1/2 చెక్క నిమ్మరసం,కారం 1 స్పూన్,మిరపకాయాలు 2 చీల్చినవి,1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,పుదీనా కొంచెం,ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు ఓ 2 స్పూన్లు కలిపి ఓ 1/2గంట నాన నివాలి.

    అరగంట తరువాత ఓ వెడల్పాటి,మందంగా ఉన్న గిన్నె(ఫ్రై పాన్)తీసికుని దానిలో 2 స్పూనుల నెయ్యి లేదా రిఫైండ్ ఆయిల్ వేసి వేడి ఐనతరువాత కొంచెం జీడిపప్పు వేయించి తీసికుని,మిగిలిన దానిలో మనం నానపెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని వేసేయ్యాలి. ఓ నిముషం ఉడికినతరువాత,దానిపైన మనం ముందుగా సగం ఉడికించిన బియ్యం వేసి పైన మరలా వేయించిన ఉల్లిపాయలు,జీడిపప్పు,కొంచెం పుదీనా,కొత్తిమీర,పైనకూడా ఓ స్పూన్ నెయ్యి వేసి మూత గట్టిగాపెట్టి(కుక్కర్ ఐతే వైట్ పెట్టి,మూత బిగించాలి)ఓ పదినిముషాలు తక్కువమంట మీద వుంచి తరువాత దానినే మందపాటి రొట్టెల పెనం స్టవ్వుమీద వుంచి మొత్తం మంట తగ్గించి దానిపై గిన్ని ఉంచి ఓ 30 నిముషాలతరువాత తీస్తే పైన తయారు చేసిన బేబీ ఆలూ ధం బిర్యానీ తయార్.
     దానిలోకి కూర ఏమి చేశాననుకున్నారు.ములగకాడలు,జీడిపప్పు,టమోటా కుర్మా.పెరుగు పచ్చడి తెలిసిందే.ఇక కుర్మా తయారీ  అంటారా మరో పోస్టులో చెప్పుకుందాం. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూ

                             
                   
                      



      లక్ష్మీస్ మయూఖ కూడా వంటల పోస్టు పెట్టేసిందోచ్.అవునండీ ఈ రోజు నేను నా స్వంత వంట అంటే(నా ప్రయోగం)అనమాట.అదే చేశా.ఎప్పుడో ప్రయత్నించి విజయవంతమైనతరువాత ఇన్నాళ్ళకు నా బ్లాగులో పెట్టాలనిపించింది.చదివిన వాళ్ళు మీ స్పందనలు తెలియ చేస్తారనుకుంటా.ఏముంది ఓ కామెంట్ పడేస్తే సరి.

     ఇక తయారు చేసే విషయానికి వస్తే,

    తయారీ విధానం: 1/2 బాస్మతి బియ్యంలో లవంగాలు ఓ 5,దాల్చినచెక్క చిన్న ముక్కలు ఓ 3,యాలకులు ఓ2,బిర్యానీ ఆకు,పుదీనా కొంచెం,జాపత్రి 3 రేకులు ఓ పావు స్పూన్ ఉప్పు వేసి బియ్యాన్ని సగమే ఉడికించుకోవాలి.

    దానికంటే ముందు చేయవలసినది చిన్న చిన్న ఆలూలు దొరుకుతాయ్ వాటినే బేబీ ఆలూలు అంటారు. వాటిని ఉడికించి పొట్టు తీసి వాటికి ఫోర్క్తో కొంచెం గుచ్చి,వాటికి 2కప్పుల పెరుగు,జాజికాయ పొడి 2చిటికెలు,లవంగాలు,చెక్క,యాలకుల పొడి ఓ1/2 స్పూన్,1/2 చెక్క నిమ్మరసం,కారం 1 స్పూన్,మిరపకాయాలు 2 చీల్చినవి,1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,పుదీనా కొంచెం,ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు ఓ 2 స్పూన్లు కలిపి ఓ 1/2గంట నాన నివాలి.

    అరగంట తరువాత ఓ వెడల్పాటి,మందంగా ఉన్న గిన్నె(ఫ్రై పాన్)తీసికుని దానిలో 2 స్పూనుల నెయ్యి లేదా రిఫైండ్ ఆయిల్ వేసి వేడి ఐనతరువాత కొంచెం జీడిపప్పు వేయించి తీసికుని,మిగిలిన దానిలో మనం నానపెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని వేసేయ్యాలి. ఓ నిముషం ఉడికినతరువాత,దానిపైన మనం ముందుగా సగం ఉడికించిన బియ్యం వేసి పైన మరలా వేయించిన ఉల్లిపాయలు,జీడిపప్పు,కొంచెం పుదీనా,కొత్తిమీర,పైనకూడా ఓ స్పూన్ నెయ్యి వేసి మూత గట్టిగాపెట్టి(కుక్కర్ ఐతే వైట్ పెట్టి,మూత బిగించాలి)ఓ పదినిముషాలు తక్కువమంట మీద వుంచి తరువాత దానినే మందపాటి రొట్టెల పెనం స్టవ్వుమీద వుంచి మొత్తం మంట తగ్గించి దానిపై గిన్ని ఉంచి ఓ 30 నిముషాలతరువాత తీస్తే పైన తయారు చేసిన బేబీ ఆలూ ధం బిర్యానీ తయార్.
     దానిలోకి కూర ఏమి చేశాననుకున్నారు.ములగకాడలు,జీడిపప్పు,టమోటా కుర్మా.పెరుగు పచ్చడి తెలిసిందే.ఇక కుర్మా తయారీ ఎలా అంటారా మరో పోస్టులో చెప్పుకుందాం. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూ.....

                                                లక్ష్మీస్ మయూఖ.
                     
                      

Monday 25 May 2015

మానవ మృగం:

    ఇంకా చట్టాలు,న్యాయస్తానాలు,బెయిళ్ళు అంటారా?.జరిగే అకృత్యాలు అన్నీ,ఇన్నీ కాకుండా వున్నాయ్.ఎన్నాళ్ళిలా తాత్సారం చేస్తారు.మానవులంతా మృగాలుగా మారి ,వావి వరసలు మరచి ఎన్నెన్ని దురాగతాలకు పాల్పడతారు?ఎన్నాళ్ళిలా !.తప్పు జరిగిన వెంటనే శిక్షలెందుకు అమలు జరగటం లేదు?.అందుకేకదా ఇలా రోజు రోజుకు నేర ప్రవృత్తి పెచ్చురిల్లుతూ వుంది.ఎంత పరాకాష్టకు చేరిందంటే పాము తన గుడ్లను తానే తింటుదట. అది ఆ సమయంలో కళ్ళు కానరాక చేసే పనైతే,మరి మనిషికి ఏమి వచ్చింది.పోయే కాలం ఎన్నాళ్ళకు వస్తుంది.  జరుగుతున్న సంఘటనలు మరింత అరాచకాలకు,అకృత్యాలకు నాందిలా మారుతున్నాయేగానీ ఏ ఒక్కరిలో భయం,తప్పు చేస్తున్నామనే ఆలోచనలు మనుషుల్లో కలగటంలేదంటే,ఏమిచేసినా మనలను ఎవరూ ఏమీ చేయలేరనే నిర్లక్ష్య ధోరణి నానాటికి పెరిగిపోబట్టే కదా.అది పోవాలంటే ఒకటే దారి.తప్పుజరిగిన చోటే ఫలానావాడి వలన తప్పు జరిగిందని తెలిసిన వెంటనే శిక్ష అమలు జరిగి తీరాలి.అదికూడా చాలా భయంకరంగా వుండాలి.మరొకడు చేయాలంటే వణికిపోయేలా వుండాలి.కానీ ఎప్పుడు? ఆ రోజులు వస్తాయ్.అసలు వస్తాయా?రావా?అప్పటిదాకా ఈ దురాగతాలకు అంతులేదా?.

     చదివిన అందరికీ ఈపాటికే అర్ధమై వుంటుంది.ఈ పోస్టు నిన్న జరిగిన అరాచకం గురించేనని.అసలు ఒక తండ్రి అలా...అనుకోవటనికే చాల జుగుప్సగా వుంది కదా.అతనుకూడా నిన్నటిదాకా మన మానవలోకలో సంచరించినవాడెకదా.అకస్మాత్తుగా అలా ఎలా మృగంలా మారిపోయాడు.బలహీనతలకు అంతులేదా?.సమాజానికికూడా ఎంతోకొంత బాద్యత వుండాలి.నినంటిదాకా మనతో,మనమద్య సంచరించినా అతనిలోని రుగ్మతను గుర్తించలేకపోఇంది.అదే జరిగివుంటే ఓ పసిమొగ్గ ప్రాణం నిలబడి ఉండేది.ఓ తల్లికి కడుపుకోత కలిగేది కాదు.ఓ ధుర్మార్గుడు తయారయ్యేవాడు కాదు.ఇప్పుడిక శిక్ష తప్ప వేరే మాటే లేదు.

    మరో ప్రబుద్దుడు ఒక భార్యను చంపి,మరో భార్యను చిత్రహింసలకు గురిచేస్తే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.దాదాపు చావు బతుకులమద్య కొట్టుమిట్టాడుతున్న ఆమె తన మరణవాఙూలంలో భర్త పేరు చెప్పి నందుకు రెండు రోజుల ఆమె ఆయుష్షును కూడా తీయాలనుకున్నాడట.ఇంతకంటే ధారుణాలు ఎక్కడైనా వున్నాయా?.మరీ ఇంత అకృత్యాలా!.జంతువులైనా ఆకలైనపుడే తోటి జంతులపై దాడి చేస్తాయ్.ఆలోచనాశక్తివున్న మానవులం జంతువులకంటే హీనాతి హీనంగా ప్రవర్తిస్తున్నాం కదా!.సాంకేతికంగా ఎంత ఎదిగినా మనలోని రుగ్మతలను మాపుకునే స్తాయిలో మొదలులోనే ఉన్నామనిపించటంలేదూ!.ఇక ఇంతేనాతరాలు తరాలు. ఎప్పటికిఈ మార్పు అనేది రాదా?భయంగా వుంది.వావివరుసలు లేని సమాజంలో వున్న మన జాతినిచూశా దేశ దేశాలు మన సంస్కృతిని కొనియాడుతున్నాయని రోజుకోసారి సభలు,సమావేశాలలో ఉపన్యాసాలిస్తున్నాం.

     ఇలాంటి సంఘటనలు మరోచోట పునరావృతం కాకుండా చాలా కటినంగా వ్యవహరించాలి.ప్రసారమాద్యమాలద్వారా తెలిసికునేది అవి నాగరిక సమాజలో అసంబద్దమైనవని  తెలిసికోవటానికేగానీ మరోరకంగా చేయటానికి ఊతం కాదని,నేరప్రవృత్తికి పాల్పడితే శిక్షలు కటినంగా ఉంటాయని తెలిసికోవాలి.పాల్పడినవారు శిక్షకు బలి ఐతే,వారితో సంబంధం వున్నవారు ఏమీ పాపంచేయకపోయినా జీవితాలలో చాలా నష్టపోతారు.ఇవన్నీ ఆలోచించుకోవాలి.

       

Tuesday 7 April 2015

నిజంగా "రోజులు మారాయ్":

   నిన్న చాలా సంవత్సరాలతరువాత విజయవాడలో షాపింగుకు వెళ్ళాను.90ల లో నేను చదువుకునే రోజుల్లో ఎక్కువ వస్త్రలతలో శిల్ప టెక్స్ టైల్స్ అని వుండేది. నాకు సంబందించినంతవరకు నాకు నచ్చే శారీస్ అన్నీ దానిలోనే కొనుక్కునేదాన్ని.లేకుంటే నెల్లూరు నుండి ఒక తాతగారు వెంకటగిరి శారీస్,చిన్న వయసువారికి నప్పే ఫాన్సీ చీరలు తెచ్చేవారు.ఇక ఈ రెండు చోట్లే నా వివాహంవరకూ షాపింగ్.నేను చదువుకుంటూనే నా కర్చులకు సరిపడా ట్యూషన్స్ ద్వారా సంపాదించుకునేదాన్ని.

    ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు కదూ.ఇలానే ట్రాక్ తప్పేస్తూవుంటా.వస్త్రలతలో ఆషాప్లోనే చీరలు కొనేదాన్ని అని చెప్పాను కదా.అందులో ఒక పెద్దాయనవుండేవారు.వారి కొడుకులేమో గుర్తుకులేదుకానీ వారూ వ్యాపారంలో ఆయనకు సహకరిస్తూ వుండేవారు.నేను,నా స్నేహితులు అక్కడే కొనేవాళ్ళం కాబట్టి పెద్దాయన వాళ్ళ పిల్లలతో అమ్మాయి వచ్చిందిరా అడిగింది ఇచ్చి పంపండి అని నేను ఎంతకు అడిగితే అంతకు ఇప్పించేవారు.ఆ అన్నయ్యావాళ్ళు కూడా నీకనగానే నాన్న ఏమీ చూడడు తీసికో అనేవారు.ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా గుర్తు,వాళ్ళు వాళ్ళ ఇంటిలో చెల్లి కోసం ఓ చీర బ్లౌజ్ తోసహా సెట్ గా పెట్టి ఉంచుకున్నారు.నేను అనుకోకుండా కొత్త కాపురానికి  రామగుండం వెళ్ళిపోతున్నా,అప్పుడు అమ్మ ఓ చీర పెట్టాలి తెచ్చుకో అంది.షాపుకి వెళ్ళా.కొత్తగావచ్చిన సెట్ చూపించి చాలా రేర్ కాంబినేషన్ చూపించి ఇది మా చెల్లికోసం పెట్టాం.వేరే రంగులున్నాయ్ అందులో తీసికోమన్నారు.ఈ సెట్ విడిగా లోపల పాక్ చేసిఉంది.నేను నాకేవీ వద్దు ఇదేకావాలని,నేను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పా.వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు,(ఇప్పుడు వాళ్ళ ముఖాలుకూడా గుర్తుకు రావటంలేదు)తీసికువెళ్ళు నిన్ను వుట్టికేపంపమని ఆ కవర్ నాకిచ్చేసారు.అలా ఇప్పటికీ ఆ అన్నయ్యవాళ్ళు గుర్తున్నారు.

    ఇప్పుడు అసలు విషయానికివద్దాం.నిన్న 92 తరువాత వస్త్రలతకు వెళ్ళా.ఆ షాపుకోసం వెతికాను రోడ్డువైపుకే వుండేది.కనపడలేదు.లోపలకి వెళ్ళాను.ఏదో ఓ షాపులోకివెళ్ళాను,మా కజిన్ వాళ్ళ పాప పెళ్ళి షాపింగ్ అనమాట.ఆ షాపతను మాట్లాడుతున్నతీరు నాకు చాలా చిరాకనిపించింది.మొదలే అతన్ని అడిగానుకూడా.ఫలానా షాపు ఉండాలికదా అని.వుంది పక్కనే.ఆ సమాధానం కూడా ఒక మృదుత్వం లేదు.నాకు వెంటనే అన్నయ్యావాళ్ళు గుర్తుకువచ్చారు కానీ,వాళ్ళ ముఖాలు గుర్తు లేదునాకు.బహుశా నేనుకూడా వారికి గుర్తువుండకపోవచ్చు.కాలంలోవచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది.అప్పటి మనుషులకు,ఇప్పటి మనుషులకు మద్య ఎంత వ్యత్యాసం.చాలా విడ్డూరమనిపించింది.చిరాకనిపించి నచ్చినవి కూడా అక్కడే పడేసి వచ్చాం.ఇది ఇప్పటి విజయవాడలే అని సరిపుచ్చుకున్నా.కానీ నిన్నటి నుంచీ మనసులోమాత్రం ఏదో తెలియని బాధ.సాటి మనుషులతో ఓపికగా,మర్యాదగా నేడు ఎందుకు మనం ప్రవర్తించలేకపోతున్నాం?.

    ఇదే అనుభవమనుకుంటున్నారా!ఇంటిదగ్గర నెల్లూరు తాతగారు,వారి కొడుకు వచ్చే వాళ్ళు.ఆ తాతగారుకూడా అంతే.అమ్మాయ్ అడుగుతుంది ఇచ్చేయరా అని నేను ఏది ఇష్టపడితే అది మా ఇంటిలో పెట్టి వెళ్ళేవారు.ఒక సారి వాళ్ళ అబ్బాయ్ నాకు నచ్చినది రేటు కుదరదని తిరిగి తీసికున్నాడు.మళ్ళీ నెలలో తాతగారికి చెప్పాను. అన్నయ్య నాకు నచ్చినది తిరిగితీసికున్నాడని.అంతే ఆయన కోప్పడి,ఆడబిడ్డరా చదువుకుంటూ,సంపాదించుకుని కొనుక్కుంటుంటే ఇవ్వాలిరా అని చెప్పి మరలా నెలలో నాకు అలాటిదే తెప్పించి ఇప్పించారు.ఆయనకు మా పేటలో అసలు రేటు దిగడు అని పేరు ఉండేది ఆరోజుల్లో.ఆ అన్నయ్య అనేవాడు,అందరికీ తగ్గడు,మీ పాప అంటే "బంగారం" అని మానాన్న ఇచ్చేస్తారని మా అమ్మకు చెప్పేవాడు.నిజంగానే ఆ తాతగారు నన్ను బంగారం అనే పిలిచేవారు.

    అలాంటి మనుషులను చూసి,నిన్నటి మనుషులను చూసిన నేను ఎందుకు మనుషులిలా మారిపోయారని తెగబాదపడిపోతుంటే,ఇంటాయన అందరికీ నీలా తీరికవుండవద్దు.కొంచెం ఎవరైనా సాయమడిగితే చాలు అల్లుకుపోతావ్.అంత అవసరమా?,అంతా నాదేననుకుంటావ్,నేనే అవ్వాలనుకుంటావ్.ఎవరికి చెప్పు.అవసరం ఐనతరువాత ఈ రోజుల్లో ఎవరికివారే,మీరెవరో మాకు తెలియదన్నా ఆశ్చర్య పోకూడదని(ఇది ఎన్నోసారో గుర్తులేదు)హితబోధ చేశారు. రేపు మీరూ అంతేనా?అన్నా,అని మనసులో అనుకున్నటున్నాననుకుని పైకి అన్నా,ఏమిటీ?అన్న ఆయన మాటకి "ఆ ఏమీ లేదు మీకు స్నాక్స్ ఏమిచేయాలని అడుగుతున్నా అని కవర్ చేసా. చూసారా   

Wednesday 11 March 2015

ఓ నాన్నా నీ మనసే వెన్న:

     నాన్నా నీవే గుర్తుకువచ్చావ్ నాన్నా.మొన్న ఆదివారం నేను చాలారోజులతరువాత బీసెంట్రోడ్డుకు వెళ్ళా.కేవలం నీతో నేను కలసి తిరిగిన ఙాపకాలను నెమరువేసుకునేదుకే వెళ్ళా. తిరిగినంతసేపూ నువ్వు నాపక్కనేఉండి అదివరలోలా నాతో మాట్లాడుతున్నట్ల్లే అనిపించింది. అదే రోడ్లో ప్రతీ మూలా వెతికా నాన్నా నెవు ఎక్కడన్నా కనబడతావెమోనని.నా పిచ్చి గానీ ఐదు సంవత్స్రాలక్రితం నన్ను వదిలివెళ్ళిన నీవెలావస్తావ్. ఐనా నాకెందుకో ఆశ చావటంలేదు. మా నాన్న ఇక్కడే ఎక్కడో వున్నారని మొత్తం కలియతిరిగా. నువ్వు పచారి సరుకులు కొనే లక్ష్మీ జనరల్ స్టోర్లో చూసా.మీ అల్లుడుకి కూడా చెప్పా.అక్కడే మా నాన్న సరుకులు తీసికునేవారని,సరుకులతోపాటు ఓ పావు కేజీ జీడిపప్పు విడిగా కొని మాకు పెట్టేవారని. మానాన్న ప్రేమకు హద్దువుండేది కాదని చెప్పా. ఆయనకు కూడా బాగా గుర్తుకువచ్చారు నాన్నా.మోడ్రన్ కేఫ్కి తీసికువెళ్ళారు. అంకుల్ ఇక్కడే నాకు కాఫీ ఇప్పించేవారు.చాలా బాగుండేది అని ఆయన అనేటపుడు ఆయన కళ్ళలో తడి నేను చూసాను నాన్నా. ఇప్పటికీ ఆయన అంటున్నారు నాన్నా "నా జీవితంలో నేను ఎరుగని రుచులు, నా తండ్రి కూడా చూపించని రుచులు మా అంకుల్ నాకు నేర్పారు అని.ఏది మెరుగో అదే మాకు పెట్టారు అని కూడా అంటున్నారు నాన్నా. నీవు మాకూ అలానే ఇచ్చావ్ అన్నీ. కొన్ని తప్పిదాలు జరిగినా నీఆలోచనావిధాన వేరుగా ఉండేది కదా నాన్నా.మొన్న మీ మేనమామ వచ్చారు మా ఇంటికి.ఆయనకూడా ఇదే చెప్పారు "వాడి ఆలోచనావిధానమే వేరు,దాన్ని అర్ధం చేసికునేవాళ్ళు బహు తక్కువమంది వుంటారు.వాడికి మంచి అనిపించినది ఎవరు అడ్డుపడినా చేసేస్తాడు,ఎవరిగురించీ ఆగడు" అని.ఇక ఆరోజు బజార్లో తిరుగుతున్నంతసేపూ నిన్నే తలుచుకుంటూ ఉన్నాం.మేము ఏమీ కొనలేదు.కేవలం నీఙాపకాలను నెమరువేసికునేందుకే వెళ్ళాం.కార్ పార్కింగ్ దగ్గరనుంచీ నీ మాటలే.వెనుక రెడ్డయ్యగారు కూడా గురుతుకువచ్చారు. నీవు డయాలసిస్ చేయించుకునే దశలో నిన్ను చూసి రెడ్డయ్యగారు చాలా బాధ పడ్డారు. నాతో అన్నారు. చాలా వేగంగా నడిచేవారమ్మా.రెడ్డయ్యగారూ మా అమ్మాయి వస్తోంది ఆమె వస్తువులు రేడీ అయినాయా? అని,మరలా ఏదో చేపించుకోవాలనుకుంటుంది,ఆడపిల్లల తల్లికదా,నేను ఒక్క పిల్ల ఐనా నా పరిస్తితులలో నేను చేపించలేకపోయానండీ.మా అమ్మాయికి ఇద్దరు పాపలు,ముందు ముందే అన్నీ వుంచుకోవాలని,నాలా చేయకూడదని తాపత్రయం అని చెప్పేవారటగా నాన్నా.రెడ్డయ్యాగారే చెప్పారు. ఇన్ని చెప్పి,నిన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్న ఆయన నీకంటే ముందే అదే కిడ్నీల సమస్యతో చనిపోవటం నాకు చాలా బాధగా ఉంటుంది నాన్నా.అక్కడికి వెళ్ళగానే ఆయనకూడా గుర్తుకువస్తారు.రా అమ్మా నాన్నగారు అమ్మాయి వస్తదని చెప్పారు.ఎప్పుడు వచ్చారమ్మా అని చాలా ఆప్యాయంగా పలుకరిచేవారు.ఆయనా లేరు.విజయవాడ వస్తే నీ స్నేహితులు కానీ బంధువులు కానీ నీ గురించీ తలిస్తే నేనసలు తట్టుకోలేకపోతున్నా నాన్నా.శ్రీ రామా స్వీట్స్ చూసినా నీ గుర్తులే.నాతో పేచీ పెట్టుకుని మరీ అక్కడ స్వీట్స్ తిన్నావ్. నేను ఏడ్చినా నీవు ఆ స్వీట్స్ తినటం మానేవాడివికాదు.అదేమంటే స్వీట్స్ తినే వారికి కపటం తెలియదని సెలవిచ్చేవాడివి.నన్ను మీ అమ్మనని అనే వాడివికదా.నేను నిన్ను చిన్నతనంలో వదిలి వెళ్ళానన్ని నన్ను త్వరగా వదిలివెళ్ళావా నాన్నా.నాకు చాలా భాద్యతలున్నాయ్ నాన్నా.ఎలా వాటిని తీర్చుకోవాలో చెప్పటానికి నీవెక్కడ.నాకేమీ పాలుపోవటంలేదు.చీకటిలో దీపంలేకుండా గమ్యానికి నా ప్రయాణం ఎలా నాన్నా.ఇంత నిర్ధయగా నన్నెందుకు వదలివెళ్ళావ్?.మీ అమ్ములుకెవరున్నారు.అన్నీ నీవేకదా.నీ మనుమరాళ్ళుకూడా నీవులేని విజయవాడలో ఉండలేమంటున్నారు. నీవులేని లోటు అన్ని చోట్లా కనబడుతోంది.నాకు మాత్రం చాలా లోటు.నాకు నీవే లోకం నాన్నా.ఇంకా నీవులేవంటే నమ్మబుద్ది కావటం లేదు.నాతో ఎప్పుడూ మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.నీవు పరిచయంచేసిన లోకంలో నీవులేకుండా ఉంటున్నానా అని,త్వరగా నా పనులు పూర్తిచేసికుని నీ దగ్గరికి వచ్చేయాలని అనిపిస్తుంది.నీకూ బహుశా నా బిడ్డ నేనులేకుండా ఎన్ని బాధలుపడుతుందోనని అనిపిస్తుందా.నిజమే నాన్నా నీవు లేకపోవటమే నాకు పెద్ద బాధ.మిగిలినవి వద్దు.అందరూ నన్నుచూడగానేఅ నువ్వే గుర్తుకువస్తున్నావంటుంటే ఇంకా కుళ్ళువస్తుంది నాన్నా.నాకెందుకీరూపమిచ్చావ్.నన్నెందుకు అంతలా ప్రేమించావ్.నీవొక్కడివే నాకు అందరి ప్రేమను ఇచ్చావ్. అందుకే అంతలా గుర్తుకువస్తున్నావ్.నేను నిన్ను మరువలేకపోతున్నాను నాన్నా.నా మాటలుకూడా నీలానే ఉన్నాయట. మీ మామయ్య అన్నారు. అచ్చు వాడిలానే మాట్లాడుతున్నవే అనేసరికి నాకు దుఖం పొంగుకువచ్చింది. నిజంగానే నువ్వు నేర్పినవే కదా నాన్నా ఎవరితో ఎలా మాట్లాడాలి,పలికే మాటలు పరుషంగా ఉండకూడదు అని,మనం మాట్లాడేదాన్ని బట్టే ఎదుటి మనిషి ప్రవర్తిస్తాడని,ఎంతటి పనినైనా,ఎంతటివాడినైనా మనం మంచి భాషణతోనే సాధించుకోగలమని చెప్పావ్. అవే నేను పాటిస్తున్నా.నీవు నేర్పినవే నేటికీ ఆచరిస్తున్నా.ఎప్పటికీ నీ కూతురుగానే ఉండి,పోతా.మనల్ని కొందరు మోసంచేసినా నీ పేరుకు తగ్గట్టుగా ఒక చెంప కొడితే మరో చెంప చూపినట్లే ప్రవర్తించాం.జరిగింది చాలా నష్టం.ఐనా భరించాం,భరించావ్.ఎప్పటికైనా నైతికవిలువలకి,ధర్మానికే విజయం అని చెప్పేవాడివికదా.నేనూ అవే నమ్ముతూ బతుకుతున్నా.ఇలా అనుక్షణం నాకు ప్రతీ చోటా గుర్తుకువస్తున్నావ్. నీవే నా శక్తి,బలం నాన్నా.నావెనుకే వుండు నాన్నా.నాపనులు పూర్తైనవెంటనే నీదగ్గరికి వచ్చేస్తా.నాకెవరూ వద్దు నీ చల్లని చేయి చాలు,నీవు పిలిచే పిచ్చి సచ్చు అనే ఆ పిలుపు చాలు.

      ఎప్పటికీ నీ ఙాపకాలతో నీ అమ్ములు అనబడే పిచ్చి సచ్చు.

Monday 23 February 2015

నవయువతా మేలుకో:

                సరైనయువతకు ఇప్పటికి అర్ధం ఐపోయివుంటుంది అసలు రాజకీయం అంటే ఏమిటో.యువతలో సరైన యువత ఏమిటని ఆశ్చర్యపోకండి అలానే అనాలి కూడా,మరి ఈరోజుల్లో ఎంతమంది యువకులు భాద్యతగా ఆలోచించగలుగుతున్నారు,(మహిళల్లోనైనా),చేసే చేతల్లో బాద్యతలేదు,చేసె ఆలోచనల్లో భాద్యతలేదు.ఎదుటివాడు తమను సమిధలుగా వాడుకుంటున్నాడని,తమ విద్యాకాలాన్ని వారి స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుంటున్నారని తెలిసికోలేక ఎంత సమయం వృధాచేసికుంటున్నారో కదా. ఐతే రాజకీయాలపై ఆసక్తి ఉండి సేవే ద్యేయంగా పనిచేస్తానికే రాజకీయాల్లోకి వచ్చే యువత ఎంతశాతముంది అంటే లేదనే చెప్పాలి.గ్రూపులు నడపడం,ఎవరోఒకరికి కొమ్ముకాస్తూ,పంచాయితీలుచేస్తూ రాజకీయంగా ఎదుగుతున్న యువతనే నేడు సమాజంలో చూస్తున్నాం.ఇలాంటి కొత్త తరమా మనం కోరుకునేది.ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయింది ఇకనుంచైనా కొత్తగా ఆలోచించే నవయువత ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందనుకుంటే పాత సీసాలో కొత్త సారాలాగా ఐపోయింది.గమనిస్తూనే వుంది సరైన యువత.అధికారంలోవున్న పార్టీ తన పాలనా కాలంలో అందినంత దండుకోవడం,ఎవరో ఒకరు జైళ్ళ పాలు కావడం,కేసులు నడుస్తూ వుంటాయ్ సంవత్సరాలతరబడి అలా సాగి సాగి ఈలోపు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది గతపార్టీ చేసిన తప్పులను ఎండగడుతూ,దేశంలో సినీ,ఇతర రంగాలలోవున్న ప్రముఖులని ప్రవేశపెట్టి,జనాలను ఉద్రేకపరచి,అధికారంలోకి రాగానే వారిని అదిచేస్తాం,ఇదిచేస్తాం అంటూ పీఠం ఎక్కుతుంది.తిరిగి షరా మామూలే.మొదట్లో చిత్రాలు చేస్తూ అసలు నిజాయితీకి మేమేరూపాలమంటూ ప్రకటించుకుంటున్నారు.నెమ్మదిగా తమ నిజస్వరూపాలను చూపుతూ నిజాయితీ అనేతొడుగును నెమ్మదిగా వదిలించుకుంటున్నారు.అది స్వచ్చంగా నేడు కానవస్తుంది.ఈ కాలంలోనే గతప్రభుత్వాల కుంభకోణాలను తెరమీదకితెచ్చినట్లు మనకి భ్రమలు కలిగిస్తారు.లోపల జరిగే వాళ్ళ వాళ్ళ లాలూచీలు వారు పడి అలా సాగతీస్తారు.మరలా మామూలే ఈ ప్రభుత్వలోటుపాట్లను ప్రతిపక్షమెండగట్టడం,గలాటాలు సృష్టించడం,దానికీ విద్యార్ధులనే ముందుకుతెస్తున్నాయ్.ఆవేశపరులంటే యువత అని వారికి బాగా నమ్మకం.దాన్ని బాగా వాడుకుంటున్నాయ్ నేటి రాజకీయ పార్టీలు.కానీ విద్యార్ధిలోకమే ఈ చిన్నా విషయాన్ని గమనించటంలేదో లేక ప్రలోభాలకు లొంగో తమ విలువైనకాలాన్ని వృధా చేసికుంటున్నారు. ఎప్పటికి మార్పువస్తుందోనని మాలాంటి పూర్వపు యువత కలత చేందుతుంది.గతంతో పోలిస్తే కొద్దిగా మార్పు వచ్చిందనే చెప్పాలి.దాని పర్యవసానమే ఈమద్య మనం ఓ ప్రభంజనం ద్వారా చూశాం.నీతులు చెప్పటం కాదు అందుకు కడదాకా కట్టుబడి ఉండాలి లేకుంటే జనం వెనక్కి పంపుతారని మనదగ్గర ఓ ప్రాంతీయ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది.అలానేఉంటుంది యువత తలుచుకుంటే. 

       చివరిగా అందరిలో ఒకరిగా నేటి యువతకు నేను చెప్పోచ్చేదేమిటంటే మీ విలువైన కాలాన్ని ఎవరికోసం వృధాచేసికోవద్దు,కాలం ఎవరికోసం ఆగదు,మీ భవిష్యత్తు కోసం మీతల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని,వాటికోసం ఎన్నో త్యాగాలు చేశారు.అవి మరిచిపోవద్దు. సమాజంకోసం భాద్యతగా ప్రవర్తించాలి కాదనం,ముందు ఇల్లు చక్కదిద్ది,అనంతరం సమాజం.ఇళ్ళుబాగుంటేనేకదా సమాజం బాగుండేది. బంగారంలాంటి మీ భవిష్యత్తును వాడుకుని ఎవరోకాదు,మన తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోండి.వారి కలలను నెరవేర్చండి.అంతేగానీ స్వార్ధపూరిత రాజకీయరొంపిలోకి దిగి మీ భవిష్యత్తు పాడుచేసికోవద్దు.మీరేకనుక తలుచుకుని శ్రద్దపెడితే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు.దానికోసమే భావి లోకం ఎదురుచూస్తుంది.

      సర్వేజనా సుఖినోభవంతు.     

Monday 16 February 2015

శివోహం:

           బ్లాగు మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.ఆ పరమేశ్వరుని దయ అందరికీ కలగాలని,శాంతి,సౌభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కాంక్షిస్తూ...

Thursday 12 February 2015

ఏమైపోయినవా పత్రికలు:

        మా చిన్నతనంలో అమ్మ,నాన్న చదివే ఆంద్ర సచిత్ర వార పత్రిక,అమ్మ,అమ్మ స్నేహితులు చదివే వనితా జ్యోతి అనే మహిళా మాస పత్రిక,మా పిల్లల కోసం బాలమిత్ర,బాల జ్యోతి,సినిమాలకు సంబందించిన విజయ చిత్ర,జ్యోతిచిత్ర,శివరంజని వంటి పత్రికలేమై పొయాయ్.దయచేసి తెలిస్తే ఎవరైనా తెలుపగలరు.వనితా జ్యోతి నేను పదవతరగతికి వచ్చేవరకూ వుంది.చదివానుకూడా.మంచి మంచి అంశాలుండేవి.పుస్తకం కూడా చాలా బాగుండేది.తరువాత చదువులు,పెళ్ళిళ్ళులో పడి ఈ పుస్తకాలగురించి తెలియలేదు.ఇప్పుడు కాస్త వీలుచిక్కి చదువుదామనుకుంటే మంచి పత్రికలేవీ లేవు.వున్నవంత బాగుండలేదు.ఆంద్రభూమి లో కూడా మల్లిక్ గారి జోకులు,హాస్యభరితమైన ధారావాహికలు వచ్చేవి.అవి కూడా బాగావుండేవి.తరువాత పల్లకి,రచన అనే పుస్తకాలు కూడా చదివాను.బాగుండేవి.తరువాత అవీ కనబడ లేదు.అవేవుంటే ఈ టివిలలో చెత్త ధారవాహికలు చూడాల్సిన భాదవుండేది కాదు.కాస్త పత్రికా పఠనంవలన గృహిణులకి ఙానం పెరిగేది.అదీ లేకుండాపోవటంతో పఠనాశక్తి తగ్గిపోయింది.కళ్ళుమాత్రం ఆ టివికి అతికిస్తున్నాం.ఎన్నాళ్ళు చూస్తాం అవి మాత్రం.ఎంతైనా పత్రికలకు సాటి మరే రంగం లేదని నాకనిపిస్తుంది.

     సరే ఎటో ఎటో వెళ్ళి పోతున్నా.చెప్పదలచుకున్నది,ఆశగా ఎదురుచూసేది మరలా అలాటి సాహిత్యాలతో కూడిన పత్రికలు వచ్చి మరలా పాత రోజులు రావాలని.ఎందుకంటే "పాతవెప్పుడూ బంగారమే".వాటి ద్వారానైనా విలువలకు ప్రాణం పోసినట్లౌతుందని. దయచేసి విలువలగురించి వ్రాస్తే ఎవరు చదువుతారని అనవద్దు.చదివే వారున్నారు,వుంటారు ఎప్పటికీ.పాలల్లో నీళ్ళు కలిసినంత మాత్రాన పాలన్నీ నీళ్ళైపోవుగా.పాలు పాలే,నీళ్ళు నీళ్ళే.ఏమంటారు?.  

Tuesday 10 February 2015

కరిగిపోయే కాలం:

       ఈ సృష్టిలో కాలమంత కాటిన్యమైనది మరొకటి లేదనిపిస్తుంది.అనిపిస్తుందేమిటి..అదే నిజం.కాదని ఎవరినైనా అనమనండి...అదే నిజం.మనం చదువుకునేదశలో గురువులు చెప్తూ ఉండేవారు,"కాలాన్ని వృధా చేసికోకండి,ధనం పోతే సంపాదిమంచుకోవచ్చు,కానీ కాలం తిరిగి రాదని".అప్పుడు ఆ దశలో చాలా తేలికగా తీసికుంటాం.మనమూ ఒక్క జీవితంలో ఓ దశకి చేరుకున్నాక అనిపిస్తూ ఉంటుంది"అప్పుడు అలా చేసిఉండల్సిందికాదు,ఇలాచేయవలసింది అని".కానీ ఆ  క్షణాలు మళ్ళీ రావుగా. ప్రతీ మనిషీ ఏదో ఒక క్షణంలో వాళ్ళు బయటపడినా,పడకపోయినా,ఏదో ఒక సంధర్భంలో ఇలా అనుకోకుండా వుంటున్నారా అంటే?లేరనే చెప్పాలి.

      కాలం,వాయిదా అనేవి బద్ద శత్రువులు.ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నవి.దేన్ని ఎప్పుడు చేయాలో అప్పుడే ముగించాలి.కాలం,క్రియ అనేవి మంచి మిత్రులు.చూడండి మనందరివిషయంలోనే చూద్దాం,అన్నీ పనులు వాయిదా వేయకపోయినా ఎప్పుడో ఒకపనినైనా చేయవలసిన సమయంలో చేసిఉంటాం.దానిని తిరిగి మనం చూడవలసిన అవసరం ఉండదు.అలా కాకుండా వాయిదావెస్తూ పోతున్న పనులు రాకాశిలా పెరిగి మనలను మనశ్శాంతి లేకుండా అశాంతికి గురిచేస్తుంది.కూర్చున్నా అదేద్యాస,నిల్చున్నా అదే ద్యాస.దేనిమీదా ఏకాగ్రత కుదరదు.ఏపనిమీద సైగా దృష్టి పెట్టలేము.దేనినీ మనస్పూర్తిగా అస్వాదించలేము.పోనీ వాయిదావేసిన పనిసంగతి ఇప్పుడు చూద్దామంటే పరిస్తితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.దీనితో పక్కనవారిపై అసహనం,అక్రోశం,ఆగ్రహం(పుణ్యానికి వచ్చేదేగా).ఇన్నిటికి కారణం కాలం విలువనెరుగకపోవడం.ఒక తరం నుండీ మరో తరం దీనినే వారసత్వంగా తీసికుంటున్నామేగానీ,ఏతరమూ అసలు విస్మరించిన దానిని సరిదిద్దు కోవటంలేదు.ఇది మానవ నిర్లక్ష్యమా?లేక కాలం యొక్క కాటిన్యమా?అనిపిస్తుంది.విద్య,విఙానంలో అభివృద్ధి సాధించినా ఈ ఒక్క విషయంలో మనిషి తప్పటడుగు వేయకుండా ఉండలేకపోతున్నాడు.

     నా సంగతే చూద్దాం.నేను ఏడవతరగతి చదువుకునే రోజుల్లో మా ప్రధానాచార్యులు రోజూ ప్రార్ధన సమయంలో ఒక మంచి మాట చెప్పే వారు.అందులో ఆయన చెప్పిన మాటల్లో నాకు బాగా గుర్తుండి పోయినది,నేను ఇప్పటికీ ఆచరించేది చెప్తున్నా,"నేటి పని నేడె".నాకు చాలా ఇష్టమైన వ్యాక్య.ఆ ఒక్క మాట నాటి నుండీ నేటి వరకూ నా పరిది వరకూ ఆచరిస్తూ వచ్చా.అబ్బో ఐతే మీకు ఎటువంటీ ఇబ్బందులూ వుండి వుండకపోవచ్చు అనుకోకండి.అనుకుంటే పప్పులో కాలేసినట్లే.మనం పాటిస్తేనే చాలదు.మన చుట్టూ వాతావరణం కూడా అందుకు సహకరించాలి.ఏ ఒక్కరి సహకారం లేకున్నా తిరిగి మామూలే.కానీ గృహిణిగా నా పనులు మాత్రం ఎప్పటివప్పుడే చేసి ఉంచుకోవటంలో సఫలీకృతురాలినే.దేనికీ ఎవరినీ నిరీక్షించనీయను.తగుసమయంలో,వీలైతే ముందే పూర్తిచేస్తా.కానీ ఇవే కాదుగా జీవితానికి.ఇంతకంటే ముక్యమైన కార్యాలు ఎన్నో వుంటాయ్.వాటిలో ముందుంటే గురువుగారు చెప్పినదానిని నూటికి నూరు శాతం నేను ఆచరించాను అనే సంతృప్తి ఉంటుంది.ఇవన్నీ కాలమే ఆడిస్తుంది.ఇవన్నీ ఆలోచించుకుంటూ వుండేలోపు కరిగిపోతూనే ఉంటుంది కాలం.లక్ష్యం ప్రశ్నార్ధకంగా మనముందు నిలబడుతుంది.అప్పుడు ఆదుర్ధా పడి ఏమీ చేయలేము,చేసినా సంతృప్తికరంగా చేయలేం. కనుక ఎప్పటి పనిని,అప్పుడే ముగించు కోవటం ఉత్తమం.కాలం ఎవరికీ చుట్టం కాదు.ఎవరికోసం ఆగదు.అది చూపించే చిత్రాలు చూడటానికి చివరికి మనిషికి ఓపిక కూడా ఉండదు.చెప్పానుగా కాలానికున్నంత కాటిన్యం ఎవరికీ ఉండదు. నిర్ధక్షిణ్యంగా జీవితాలు జీవితాలను చిదిమేస్తుంది.ఆనక సరిదిద్దుకుందామనుకున్నా దారే దొరకదు.పరిష్కారం దొరకదు.

    ఇంతకూ నేను చెప్పోచ్చేదేమిటంటే మిత్రులారా(నా పోస్టు చదివిన వారు)ఎంతోమంది చెప్పారు కదా మీరెంత,మీరెవరు అనుకోకుండా,కాలం విలువ గుర్తెరగండి.ఇది ఏ విధ్యార్ధులకో చెప్తున్నాననుకోకండి.అందరం అన్ని వయసుల వారం,ఎవరం వారి వారి పనులను ఎప్పుడు పూర్తి చేయాలో అప్పుడే పూర్తి చేద్దాం.ఆనక పరుగులు తీయలేం.మొదలు "వాయిదా వేయటాన్ని" తీసేద్దాం.కాలమనే రక్కసి కోరలకు సాద్యమైనతవరకూ దొరక్కుండా తప్పించుకోవటానికి ప్రయత్నిద్దాం. సాద్యంకాకపోయినా ఓపిక ఉన్న సమయంలోనే మన భాద్యతలు పూర్తిచేసి ఆ తరువాత మీకు తెలిసిందే కదా తామరాకు,నీటి బొట్టు.అలా జారి పోవాలి.అదే ఈరోజు మీకు చెప్పాలనిపించింది.అందరివిషయంలో ఇలాగే జరగాలని కోరుకుందాం.

         

Tuesday 27 January 2015

అన్నలూ తప్పక చూడండి:

           ఈ రోజు ఈటివిలో ప్రసారమైన ఝుమ్మంది నాదం కార్యక్రమం ప్రతీ అన్న,చెల్లెలు చూసి తీరాలి.బాలు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ పెళ్ళి చిత్రంలోని పాట "చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే,నాకు నువ్వే"శ్రీ కృష్ణ అద్భుతంగా ఆలపించాడు.సాహిత్యమంతా విన్న వాళ్ళకి కన్ను చెమ్మగిల్లక మానదు.అదే వేదికపై బాలు,శైలజ గార్ల అనుబంధాలు,వారి చిలిపి అల్లరి,"అన్న అంటే అన్న ప్రశ్నకి శైలజ నాన్న అని "సమాధానం చెప్పినపుడు చెప్పనలవికాని బాధ కలిగింది.అందుకు బాలూ గారూ మురిసిపోయారు.అది వేరే విషయం. ఇప్పటి రోజుల్లో ఒక అన్న చెల్లి "నాకు నాన్న లేరు కదా నువ్వే కదా నాకు అన్నీ అని అంటే" ఆ అన్న చెప్పినదేమిటో తెలుసా,"నాకేం సంబంధం,నేను కన్నవారికి మాత్రమే నేను బాధ్యుడను.నిన్ను నాన్న కన్నారు,ఇప్పుడు ఆయన లేరు,నాకేం సంబంధం లేదు అని.ఆ చెల్లి ఆ అన్న ఆస్తులేమీ అడగలేదు అక్కడ.నాన్న ఇచ్చే ఓదార్పే అడిగింది.ఆ చెల్లి అటువంటి అన్నలకి అన్నీ చేసింది.అప్పుడు ఆ చెల్లి నాకేమి సంబంధం అమ్మ కదా మిమ్మల్ని కన్నది అని అడుగలేదు. ఈ రోజు చెల్లి ఆ అన్న పై మాట అన్నపుడు అంటే దానికి కూడా ఆ అన్న చాలా తెలివిగా సమాధానం చెప్పాడు.ఏమని అంటే ఇంటిలో ఆడపిల్లవి కదా పనులు నేర్చుకోవాలి కనుక అందులో భాగంగా చేశావైనా అవన్నీ, నువ్విపుడు అడుగకూడదని ఆ చెల్లిని దూరంగా పెట్టేశారు.అన్నలే అనుకుంటే పరవాలేదు ఆ చెల్లిని కన్న తల్లి కూడా స్వార్ధంతో బిడ్డను దూరంగా పెట్టింది.ఆ బిడ్డ మెట్టినిల్లు చేరేవరకూ అనారోగ్యపరురాలైన తనుకు చేసిన సపర్యలు కూడా మరిచిపోయింది.ఆడపిల్లవికనుక పనిపాటలు నేర్చుకునే పనిలో భాగంగా మాకు చేశావ్ అని నిర్ధయగా మాట్లాడింది.ఆ కూతురు ఆ తల్లి మాటలు విని జీవితంలో చాలా కోల్పోయింది.ఏమిటో ఆ తల్లికి తెలుసు.కానీ ఒప్పుకోదు.కారణం స్వార్ధం. ఆమే ఎప్పుడూ చెప్తూ ఉండేది "కలికాలం,కడిగేసుకుపోయే కాలమని".దానికి ఆమె కూడా తలవంచింది. 

        ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోకమంతా పైవిధంగా లేదని బాలూ గారు,శైలజగార్లను చూస్తే అర్ధమైంది.పోనీలే కొంతైనా నీతి,నిజాయితీ,ప్రేమలు,అనుభంధాలు మిగిలిఉన్నాయని అనిపించి కళ్ళు చెమ్మగిల్లినయ్.

        పైన చెప్పిన అన్నలు,చెల్లి,తల్లి కధకు భిన్నమైన కధ మరో పోస్టులో తెలిసికుందాం.ఇప్పటి వరకూ కల్తీ లేని ప్రేమ తల్లి ప్రేమ అని నమ్మినవాళ్ళకి పైన చెప్పిన యదార్ధ సంఘటనే, లేదు తల్లి ప్రేమ కూడా కల్తీనేనని రుజువు చేసింది.

        అందరూ మళ్ళీ తప్పకుండా చూడండి ఆ కార్యక్రమాన్ని.   

ఙాపకాల దొంతరలు:

     ఇంతకుముందే చదివా "ఆలోచనలు"బ్లాగులో 'మా పల్లె అందాలూ శీర్షిక. చాలా బాగుంది. అసలు పల్లెలే అందంగా ఉంటాయ్ కదా. అలా అందరం మన మన పల్లె అందాలు వ్రాస్తూ పోతేనన్నా ఈతరానికి పల్లెల అందమేమిటో,మనం కోల్పోయిన అనుభవాలు,అనుభూతులు,ప్రేమలు,ఆప్యాయతలు తెలుస్తాయేమో.

    నిజంగా మా అమ్మమ్మగారి ఊరు కూడా చాలా బాగుండేది. మాది మచిలీపట్నం దగ్గర కలపటం అనే చిన్న గ్రామం. అందులో ఇళ్ళుకూడా చాలా తక్కువ వుండేవి. అన్ని కులాల వారూ కలసి ఉండేవారు. తాతగారు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ముగ్గురు తాతల ఇళ్ళు పక్క పక్కనే వరుసగా ఉండేవి. సంక్రాంతి పండుగకి ఎక్కువరోజులు ఉండేవాళ్ళం మేము. మా తాతగారే పెద్దవారు కనుక మొదలు మా ఇల్లే వుండేది. సంక్రంతి నెల పట్టినదగ్గరనుంచీ పిన్నీ వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు.అవికూడా ఒకటి రెండూ కాదు.ముప్పై,నలభై చేసేవారు. అంత పెద్ద వాకిలిలో పెద్ద మెలికల ముగ్గు,దాని నిండా పసుపు కుంకుమ,గొబ్బిళ్ళు.వాటికి అగరుబత్తి వెలిగించి బెల్లం,ధాన్యం నైవేద్యంగా పెట్టేవారు.నేను మా పిన్నులచుట్టూ తిరుగుతూ చాలా ఆసక్తిగా ఆలకించేదాన్ని.మద్యహ్నం నుంచీ పిండి వంటల చర్చలు మొదలయ్యేవి.ఈ రోజుల్లోలా కేజీ,రెండు కేజీలు కాదు ఆరోజుల్లో పది,పదిహేను కేజీలు బియ్యం పోసి,నానిన తరువాత దొడ్లోనే రోకళ్ళతో పిండి కొట్టే వారు. ఒకరోజు మా అమ్మమ్మ వాళ్ళింట్లో మరుసటి రోజు ఇంకొకరింట్లో,అలా ముగ్గురిళ్ళలో ఎక్కడచూసినా పిండివంటల వాసనలే. అన్నీ ఇంట్లోవే. దేనికీ బయటకు వెళ్ళే అవసరం వుండేది కాదు. వండిన పిండివటలను భోషాణంలో సర్దించేవారు తాతగారు.దాని తాళాలు ఆయనదగ్గరే ఉండేవి.రోజుకి ఒకసారే తాళం తీసి కావలసినంత బయట ఉంచేవారు. బోగి రోజుకల్లా పొలందగ్గరనుంచీ పెద్ద బల్ల తెప్పించేవారు. బొమ్మలకొలువుకు సిద్దంచేపించేవారు. ఎన్ని బొమ్మలో. నేను కొత్తబొమ్మలు కావాలని మారాం చేస్తే అమ్మమ్మ వడ్లు పోసి కొని ఇచ్చేది. అలా చాల బొమ్మలు కొనిపించుకున్నా. ఈ బెజవాడ పిల్లవస్తే ఉన్నచోట ఉండదు,కర్చు పెట్టిస్తదని,సొమ్ము మీ నాన్న దగ్గరనుంచీ తీసికుంటామని అనేది. పండుగైనతరువాత తిరిగి వచ్చేటపుడు బొమ్మ లివ్వమంటే అస్సలు ఇచ్హేది కాదు. మళ్ళీ సంవత్సరం వస్తావుగా అప్పుడు కావాలిగా అని, అన్నీ బుట్టకెత్తించి పైన అటకెక్కించేది అమ్మమ్మ. అమ్మమ్మతో పాటే అన్నీ పొయాయ్.ఏ మైనావో కూడా తెలియదు. అత్తావాళ్ళు వచ్చినతరువాత ఇంటి పరిస్తితులు మారి,వెళ్ళడం తగ్గి పోయింది. వెళదామన్నా మా అమ్మా వాళ్ళే "ఆ ఎవరున్నారు,ఏముందక్కడ,అంతా మా పెద్దవాళ్ళతోనే పోయిందని" నిరుత్సాహపరుస్తారు. వాళ్ళకే లేనపుడు మేమెలా వెళ్ళగలం.కానీ ఆ ఙాపకాలు డిసెంబర్ వస్తేచాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయ్. అక్కడకెళ్ళకపోయినా ఆ నెలరోజులూ ముగ్గులు వెయ్యటం,పండుగ మూడు రోజులూ గొబ్బిళ్ళు పెట్టటం చేస్తా. కొన్నాళ్ళు వారు విసుక్కున్నారు. ఇపుడు ఈమె ఇంతేనని సహకరిస్తున్నారు. నా పిల్లలు చేయకపోయినా నేను చేసుకుని,అవి చూసి మురిసిపోతుంటా.  

    మా ఊరు కూడా పచ్చని పొలాలతో చిన్న చిన్న చెరువులు,దాని నిండా తామరలతో చాలా అందంగా ఉండేది, మా అమ్మమ్మవాళ్ళ వీధి చివర రామాలయం ఉండేది. తాతగారువాళ్ళకే చాలా పెద్ద పసువుల కొట్టం ఉండేది. పాలు,నెయ్యి,పెరుగు సంవృద్దిగా ఉండేవి. పెరట్లో కాసిన కూరగాయలతోనే కూరలు.పొలమునుండీ కూడా తెచ్చేవారు. ఏవీ కొనే పని ఉండేది కాదు. గుడ్లు కూడా ఇంటిలోనివే,అన్ని కోళ్ళు ఉండేవి. ముగ్గురు తాతగారి ఇళ్ళలోవాళ్ళం కలిస్తే దగ్గర దగ్గర యాబై మందిమి అయ్యేవాళ్ళమేమో.అర్దరాత్రిదాకా కధలు,కబుర్లు,ఆటలు,పాటలు.పెద్దవాళ్ళు పగలంతా పనిచేసి ఆదమరిచి నిదర్లు పోయేవారు. అప్పట్లో కిరోసిన్ దీపాలు.మేము మా లోగిట్లో కూర్చుంటే వెన్నెల తెల్లగా పట్ట పగలులా వుండేది. ఏ భయాలు ఉండేవి కాదు.ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దునే అందరూ విధిగా లేచి ఎవరి పనులలోకి వారు వెళ్ళి పోయేవాళ్ళు. అంత క్రమశిక్షణ ఉండేది. అరుపులు,కేకలు ఉండేవి కాదు. ఎవరి పనులు వారు టైంకి పూర్తి చేసే వారు.

     పండుగ మూడు రోజులముందు నాన్న వచ్చే వారు. నాన్న అంటే అందరికీ భయంగా ఉండేది.(అప్పుడు భయమను కున్నా,అది గౌరవం అని పెద్దైనాక తెలిసింది)వస్తూ నాన్న కొత్త బట్టలు తెచ్చేవారు.అదికూడా చాలా ఖరీదువి తెచ్హేవారు. అందరూ చాలా బాగున్నాయని మురుసుకునేవారు.అమ్మమ్మ పొద్దుగూకిన తరువాత అన్నయ్యలకి,నాకు దిష్టి తీసేది. అందరికళ్ళు నా పిల్లల్లమీదే ఉన్నాయని ఉడుక్కునేది. తిరిగి వచ్చేటపుడు అమ్మ ఎంతమందికి చెప్పిరావాలో.మేము కూడా చిన్న తాతా,అమ్మమ్మ,మామయ్యలు,పిన్నులు,మామ్మలు,ముత్తవ్వలు అందరికీ చెప్పి,అమ్మమ్మ ఇచ్చిన పిండి వంటలు క్యానులకు సర్దుకుని,తాతయ్య బుస్ ఎక్కించటానికి రోడ్డు వరకూ బండి కట్టించేవారు. మద్య మద్యలో చిన్న చిన్న ఊర్లు వచ్చేవి. పెద్దవాళ్ళు కొందరు ఎవరు?ధర్మరాజు(మా తాత గారి పేరు)అని అడిగితే పెద్దమ్మాయ్ వచ్చింది పండుగకి,తిరిగి పంపుతున్నా,అని తాత చెప్తూ అలా మెయిన్ రోడ్డుకి చేరుకునే వాళ్ళం.తలకటూరు వచ్చి విజయవాడ బస్ ఎక్కేవాళ్ళం.బండిలో వస్తూ వుంటే పొలాల్లో రకరకాల పిట్టల కూతలు,ఆ ప్రకృతి ఎంత అందంగా ఉండేవో.ఇవన్నీ మోసుకుని విజయవాడ చేరే వాళ్ళం. ఇప్పటికీ ఆయా పిట్టల తాలూక శబ్దాలు వినిపిస్తే నేను నా బాల్య స్మృతుల్లోకి వెళ్ళిపోతాను.

       ఈ ఙాపకాలను ఎప్పుడన్నా ఎవరితోనైనా పంచుకుందామనుకుంటే వినే వారేరి?పిల్లలు కూడా అబ్బా మమ్మీ...అంటారు.పెద్దన్నయ్య, నేనే ఇంకా ఈ ఙాపకాలను నెమరువేసుకుంటూ వున్నాం.నిజంగా ఆ రోజులే బాగున్నయ్.ఏదో అంటారు కదా"కాకై కలకాలం బతికే కన్నా,హంసలా ఆరు నెలలు బతికితే చాలని".అలా ఆస్తులు,ఆడంబరాల ఈ జీవితం కన్నా,కల్లా కపటం తెలియని అలాంటి మనుషులు,ప్రేమలు తప్ప మరొకటి తెలియని మనుషుల మద్య అటువంటి బాల్యం మళ్ళీ పొందాలని ఉంది.దేవుణ్ణైనా అదే కోరుకుంటున్నా.వెలలు కల ఈజీవితమొద్దు,వెలకట్టలేని నా బంగారు బాల్యాన్ని నాకివ్వమని.

     బోరు కొట్టిస్తే ఈ పోస్టు చదివిన వారు మన్నించండి.ఈ రోజు ఆ "ఆలోచనలు"బ్లాగు చూసి చదవకపోయినట్లైతే బహుశా ఈ నా స్మృతులన్నీ నాతో,నాలోనే నిక్షిప్తమైపోయేవేమో.ఏమొ మీ అందరితో పంచుకోవాలనిపించింది.చెప్పాను.చదివి మీ స్పందనలు చెప్పండి.          

Tuesday 6 January 2015

పాత్రో గారి ఙాపకాలలో:

           అవి నేను ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన సినిమా "సంసారం ఒక చదరంగం".అప్పటిలో వినోదవస్తువంటే టివికూడా కాదు,ఒక్క రేడియోనే.అందులో 'నీరాజనం' అని ఒక సినిమా ప్రొమోషన్ కార్యక్రమం వచ్చేది. అందులో ఆ ఆ సినిమాలకు సందించిన సన్నివేశాలు,పాటలు,వాటిని రచించినవారిగూర్చి,మాటల రచయతలగురించి,సంగీతం,నృత్యం మొదలగు విషయాలగురించి వినిపించేవారు. నేను కళాశాలకు బయలుదేరే సమయంలో ఈ కార్యక్రమాలు వచ్చేవి. అలా ఆ సినిమాలో సంభాషణలు బాగా గుర్తుకువుండి పోయాయి. అంతేకాదు ఆయా సంభాషణలు ఆ ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనలను కలిగించేవి. గొల్లపూడి గారేమిటి,నూతన్ ప్రసాద్ గారు,ఇక సుహాసిని గురించి చేప్పేదేముంటుంది.నటనకు ఆమే ఆ కాలంలో ప్రతిరూపంగాఉండేది. సినిమా అంతా ఆమెకి పెద్ద సంభాషణలు ఉండవు.చివరిలో అందుకుంటుంది.మామగారిని,ఎదురించడం కాదు అక్కడ.ఒక కుటుంబంలో విభిన్న మనస్తత్వాలుకల వ్యక్తులమద్య నలిగిపోయిన ఒక కోడలి పాత్రకి ఆమె జీవం పోశారు. దానికి సుహాసినిగారి నటనకి,మన 'పాత్రో'గారి మాటలు కలసి ఎంతబాగుంటుందంటే. చివరిగా అందరం కలసే ఉందామని ఆమె మామగారు కోడలితో అంటే వద్దని సుహాసిని అన్నపుడు వారి వారి హావ భావాలు చూడాలి.నేనైతే ఈ సంభాషణలు వినీ వినీ తప్పకుండా చూడాలని చూసిన సినిమా.చివరిలో సుహాసిని అంటుంది...ఇదేమిటి అందరూ కలసి ఉండాలని కోరుకోవలసిన కోడలు విడిపోదామంటుంది అని ఆశ్చర్య పోకండి.ఉమ్మడి కుటుంబమనేది రకరకాల పూవులతో అల్లిన దండలాంటిది.దాన్ని అందరం చించి ఎవరిష్టమొచ్చినట్లు వారు ముక్కలు ముక్కలు చేసేశాం.ఇక దాన్ని మళ్ళీ గుచ్చలేం,అలాగే విరిగిన మనుషుల మన్సులను అతకగలమా? అతకలేం. కాబట్టి విడి పోదాం,విడిపోయి కలసిఉందాం. ఎప్పుడూ కలసి కొట్లాడుకునే కంటే విడిపోయి అప్పుడపుడూ, అంటే పండగలకు పబ్బాలకు కలుసుకుందాం.బాగున్నారా...అంటే బాగున్నారా! అని ఆప్యాయంగా పలుకరించుకుందాం.ఒకసారి మీరు రండి,ఒకసారి మేమువస్తాం.అని చెప్తూ ఒక వైరాగ్యపు మాట కూడా అంటుంది "కలసి ఉంటే లేదు సుఖం"అని.

        నేను ఈ పోస్టులొ వ్రాసిన సంభాషణలన్నీ ఇప్పుడే వ్రాశాను. అసలు మళ్ళీ సినిమా చూడనుకూడా చూడలేదు. ఐనా నాకు ఈ సంభాషణలు అంతలా గుర్తు ఉండిపొయాయ్.ఈ మాటలంటే పాత్రో గారు,సుహాసినిగారే గుర్తుకు వస్తారు.ఆతరువాత సీతారామయ్య గారి మనుమరాలు.కేవలం మాటల కోసం చూసా.ఎన్ని మంచి మాటలుంటాయ్ ఆ సినిమాలూఅ కూడా.భార్య చనిపోయిన తరువాత పర్వతమంత నాగేశ్వరావు గారు కుదేలై మనుమరాలితో మీ నాన్నను పిలుపించమ్మా,మీ నానమ్మ లేదు అనే సంఘటనలో వారి నటన,అక్కడి నుండీ నాగేశ్వరావుగారు,మీనా నటన,సన్నివేశాలను వేడెక్కించే సంభాషణలు.నేనైతే గుండె దిటవుగా వున్న సమయంలోనే చూస్తా ఈ సినిమాని. ఏ కాస్త నా మనసు బాగోకున్నా టివిలో ఈ సినిమాని మొదటి భాగం చూసి వదిలివేస్తా.

       ఇక మరో చరిత్ర గురించి నేను ఏమి చెప్పగలను.ఎన్ని సార్లు చూశానో .ఎప్పటికీ కొత్త ప్రేమకధలా నాకనిపిస్తుంది.'అందమైన అనుభవం'లో కూడా సన్నివేశాలు,బరువైన మాటలు మనసును పిండేస్తాయ్.


      నిన్న బాలచందర్ గారు,నేడు వారిని వెన్నంటినట్లే పాత్రో గారువెళ్ళిపోయారు. సారమంతా పోతుంది.ఇక మిగిలేది పిప్పేనని అనిపిస్తుంది.మొన్న బాపూ,రమణలు,నాగేశ్వరావుగారు,అంజలీదేవి
ఇంకెవరున్నారు వారిని భర్తీ చేయటానికి. కాలంతో పాటే మనుషులూ,మమతలూ,రచనలూ,కళలూ,అన్నీ కలుషితమే. ఏమో ముందునాటికైనా మరలా అటువంటి మహానుభావులు పుడతారని,పుట్టాలని ఆశిస్తూ. బాలచందర్ గారికి,గణేష్ పాత్రో గారికి నివాళులు అర్పిస్తూ,


                                       లక్ష్మీస్ మయూఖ.


  •          

కనుమరుగైన తెలుగుతనం:


  •         ఎన్నాళ్ళైనంది ఇంతటి తెలుగు తనాన్ని హూసి. ఇక ముందు చూస్తామన్న ఆశ కలగటం లేదు ప్రస్తుతమున్న పరిస్తితులలో. నానాటికి కనుమరుగౌతున్న తెలుగుతన్నాన్ని ఇకముందు ఇలా చిత్రాలలో చూసి కరువుతీర్చుకోవాల్సి వస్తుంది.చిత్రించిన కళాకారులందరూ నెమ్మదిగా కనుమరుగౌతున్నారు.అదే బెంగగా ఉంది.