కార్తీక మాసం

కార్తీక మాసం

Monday 25 May 2015

మానవ మృగం:

    ఇంకా చట్టాలు,న్యాయస్తానాలు,బెయిళ్ళు అంటారా?.జరిగే అకృత్యాలు అన్నీ,ఇన్నీ కాకుండా వున్నాయ్.ఎన్నాళ్ళిలా తాత్సారం చేస్తారు.మానవులంతా మృగాలుగా మారి ,వావి వరసలు మరచి ఎన్నెన్ని దురాగతాలకు పాల్పడతారు?ఎన్నాళ్ళిలా !.తప్పు జరిగిన వెంటనే శిక్షలెందుకు అమలు జరగటం లేదు?.అందుకేకదా ఇలా రోజు రోజుకు నేర ప్రవృత్తి పెచ్చురిల్లుతూ వుంది.ఎంత పరాకాష్టకు చేరిందంటే పాము తన గుడ్లను తానే తింటుదట. అది ఆ సమయంలో కళ్ళు కానరాక చేసే పనైతే,మరి మనిషికి ఏమి వచ్చింది.పోయే కాలం ఎన్నాళ్ళకు వస్తుంది.  జరుగుతున్న సంఘటనలు మరింత అరాచకాలకు,అకృత్యాలకు నాందిలా మారుతున్నాయేగానీ ఏ ఒక్కరిలో భయం,తప్పు చేస్తున్నామనే ఆలోచనలు మనుషుల్లో కలగటంలేదంటే,ఏమిచేసినా మనలను ఎవరూ ఏమీ చేయలేరనే నిర్లక్ష్య ధోరణి నానాటికి పెరిగిపోబట్టే కదా.అది పోవాలంటే ఒకటే దారి.తప్పుజరిగిన చోటే ఫలానావాడి వలన తప్పు జరిగిందని తెలిసిన వెంటనే శిక్ష అమలు జరిగి తీరాలి.అదికూడా చాలా భయంకరంగా వుండాలి.మరొకడు చేయాలంటే వణికిపోయేలా వుండాలి.కానీ ఎప్పుడు? ఆ రోజులు వస్తాయ్.అసలు వస్తాయా?రావా?అప్పటిదాకా ఈ దురాగతాలకు అంతులేదా?.

     చదివిన అందరికీ ఈపాటికే అర్ధమై వుంటుంది.ఈ పోస్టు నిన్న జరిగిన అరాచకం గురించేనని.అసలు ఒక తండ్రి అలా...అనుకోవటనికే చాల జుగుప్సగా వుంది కదా.అతనుకూడా నిన్నటిదాకా మన మానవలోకలో సంచరించినవాడెకదా.అకస్మాత్తుగా అలా ఎలా మృగంలా మారిపోయాడు.బలహీనతలకు అంతులేదా?.సమాజానికికూడా ఎంతోకొంత బాద్యత వుండాలి.నినంటిదాకా మనతో,మనమద్య సంచరించినా అతనిలోని రుగ్మతను గుర్తించలేకపోఇంది.అదే జరిగివుంటే ఓ పసిమొగ్గ ప్రాణం నిలబడి ఉండేది.ఓ తల్లికి కడుపుకోత కలిగేది కాదు.ఓ ధుర్మార్గుడు తయారయ్యేవాడు కాదు.ఇప్పుడిక శిక్ష తప్ప వేరే మాటే లేదు.

    మరో ప్రబుద్దుడు ఒక భార్యను చంపి,మరో భార్యను చిత్రహింసలకు గురిచేస్తే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.దాదాపు చావు బతుకులమద్య కొట్టుమిట్టాడుతున్న ఆమె తన మరణవాఙూలంలో భర్త పేరు చెప్పి నందుకు రెండు రోజుల ఆమె ఆయుష్షును కూడా తీయాలనుకున్నాడట.ఇంతకంటే ధారుణాలు ఎక్కడైనా వున్నాయా?.మరీ ఇంత అకృత్యాలా!.జంతువులైనా ఆకలైనపుడే తోటి జంతులపై దాడి చేస్తాయ్.ఆలోచనాశక్తివున్న మానవులం జంతువులకంటే హీనాతి హీనంగా ప్రవర్తిస్తున్నాం కదా!.సాంకేతికంగా ఎంత ఎదిగినా మనలోని రుగ్మతలను మాపుకునే స్తాయిలో మొదలులోనే ఉన్నామనిపించటంలేదూ!.ఇక ఇంతేనాతరాలు తరాలు. ఎప్పటికిఈ మార్పు అనేది రాదా?భయంగా వుంది.వావివరుసలు లేని సమాజంలో వున్న మన జాతినిచూశా దేశ దేశాలు మన సంస్కృతిని కొనియాడుతున్నాయని రోజుకోసారి సభలు,సమావేశాలలో ఉపన్యాసాలిస్తున్నాం.

     ఇలాంటి సంఘటనలు మరోచోట పునరావృతం కాకుండా చాలా కటినంగా వ్యవహరించాలి.ప్రసారమాద్యమాలద్వారా తెలిసికునేది అవి నాగరిక సమాజలో అసంబద్దమైనవని  తెలిసికోవటానికేగానీ మరోరకంగా చేయటానికి ఊతం కాదని,నేరప్రవృత్తికి పాల్పడితే శిక్షలు కటినంగా ఉంటాయని తెలిసికోవాలి.పాల్పడినవారు శిక్షకు బలి ఐతే,వారితో సంబంధం వున్నవారు ఏమీ పాపంచేయకపోయినా జీవితాలలో చాలా నష్టపోతారు.ఇవన్నీ ఆలోచించుకోవాలి.

       

3 comments:

  1. మనం భారతదేశంలో ఉన్నామండీ

    ReplyDelete
    Replies
    1. మీ రన్న మాటలన్నీ నిజమే. మన పవిత్రభారతదేశ పరిస్థితి ఇలాగుంది! ఒకామె, తన ప్రేమవివాహానికి పెద్దలు ఒప్పుకోనందుకు కోపగించుకొని స్వకుటుంబాన్ని మొత్తం పదినెలల పసిపిల్లతో సహా పదకొండు మందిని చంపి పారేసిందట. ఆమెకు సెషన్స్ వారు మరణశిక్ష వేసారు. అత్యంత అరుదైన నేరం అని. కాని సుప్రీం కోర్టు దాన్ని నిలుపుదల చేసింది. ఇద్ని ఈ ర్జోజ్గున వచ్చిన వార్త. ఇది ఘోరనేరమా ఒక చిన్న నేరమా అన్న శంకతో కాబోలు. ఆమెకు శిక్షపడుతుందో బెయిల్ వస్తుందో (ఈ దేశంలో హంతకులకూ బెయిలిస్తారనే అనుకోవచ్చునేమో!) ఇంకా తెలియదు. ఏమోనండీ. రానురాను ఘోరాతిఘోరనేరాలు కూడా సర్వసాధారణం ఐపోతున్నాయి. బండబారిపోతోంది సమాజం.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete