కార్తీక మాసం

కార్తీక మాసం

Friday 31 October 2014

31 శుక్రవారం

ఈ రోజు మరలా అదే సినిమా "దేవస్థానం" గురించి వ్రాయాలనిపించింది. యెంత చక్కని ముగింపు అంటే, మనుషులలో ఇంకా ప్రాపంచిక సుఖాల వలన కోల్పోయే మనశాంతి, ఎవరు ముందో, ఎవరు వెనుకో తెలిసికోలేని మనుషుల మూఢత్వాన్ని చిత్రీకరించిన శైలి బావుంది. ఐతే ప్రస్తుత స్పీడ్ కాలంలో ఇది అవగతం చేసికునే తీరిక ఎక్కడ వుంది జనాలకి. ఒకటి చూడండి.. చెప్పినప్పటికంటే అనుభవించింది చాలా బాగా అర్ఠం ఔతుంది. కదా, కాకుంటే ఇక్కడ ఈ విషయం మనకు అర్థమయ్యైఅసరికి కధ ముగిసిపోతుంది, కనుమూతపడుతుంది. చాలా లేటుగా చూసినా మంచి సినిమా చూసానన్న త్రుప్తి కలిగింది.

కొన్ని సినిమాలు చూసిన కొన్ని రోజులవరకూ మనసులో మెదులుతూనేవుంటాయి.అలా ఈ సినిమా నాకనిపించింది.  

Wednesday 29 October 2014

అక్టోబర్ 29 బుధవారం    యెప్పటి నుండో నాలో ఈ సందేహం కలిగేది? ఏమిటో చెప్పకుండా కొత్తగా వచ్చిన ఈ బ్లాగర్ తికమక పెడుతోంది అనుకోకండి 'మానవ జన్మలో"జననం" ఎంతో ఉత్క్రుష్టమైనది చెప్పబడిందేగాని "మరణం" ఎందుకు అలా చెప్పబడలేదు". అందుకేనా ప్రస్తుత కాలంలో 'మరణం" అనే ఘడియానుకోండి ఘట్టమనుకోండి చాలా ధుర్భరంగా గోచరిస్తుంది. మొదలులోనే ఈమెవరు? మరణం గురించి వ్రాస్తుంది అనుకోకండి. ఈరోజు అనుకోకుండా "దేవస్థానం" అనే కొత్త తెలుగు సినిమా చూసా. పాపం సినిమా ఆడలేదు, కానీ సినిమాలో స్పౄశించిన  అంశాలు బాగా నచ్చాయి.నిజంగా ముందు ముందు మనిషి మనుగడే కాదు మరణం,మరణానంతర క్రియలు సక్రమంగా జరుగుతాయా అనే సందేహం కలుగక మానదు ఈ సినిమా చూసిన తరువాత. కర్మచేయమని, చేసేవారి కోసం వెతుక్కునే పరిస్తితులు రాబోతున్నాయని నాకనిపించింది. నాకు మరో భయం కూడా వేసింది "కర్మ" అనే ప్రక్రియ వ్యాపార వస్తువుగా మారుతుందేమోనని . పుణ్యకాలమైన ఈ కార్తీక మాసంలో ఈ సంఘటన శివ సంకల్పంగా భావిస్తాను. అటువంటి పరిస్తితులు రాకుండా పరమేశ్వరుడే మానవాళిని కాపాడాలి. అందుకు మానవ సహకారంకూడా ఉండాలి అంటాను, ఏమంటారు !      
                                                                                                                                        

Tuesday 28 October 2014

కొత్తగా పోస్టు వ్రాస్తున్నా కొంచెం తడబడుతున్నా, అర్ఠం చేసుకుంటారు కదూ, ప్రస్తుతమైతే అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు.నాకైతే ఈ మాసమంటే చాలా ఇష్టం. శివకేశవు లిరువురిని ఒకే మాసంలొ పూజించడం చాలా త్రుప్తిగా అనిపిస్తుంది.        

Sunday 26 October 2014




గ్రుహమే కదా స్వర్ఘ సీమ







నిన్నటి వరకు బ్లాగులు చదువుతుంటె ఎవరో తెలిసిన స్నేహితులు ఆత్మీయులతో నా అభిరుచులు ఆనందాలు పంచుకున్నట్లుండేది నేను కూడా బ్లాగు మొదలు పెట్టిన తరువాత పోస్టు యెంత త్వరగా వ్రాద్దమా అని అనిపిస్తుంది. వ్రాస్తానికి సన్నద్దం కావాలి కదా ఉంటా మల్లీ కలుస్తా ...

Saturday 25 October 2014






అందరికి నమస్కారమండి తెలుగు బ్లాగు లోకంలో ప్రవేసించిన మయూఖనండి... త్వరలో కలుస్తా !!