కార్తీక మాసం

కార్తీక మాసం

Wednesday 29 October 2014

అక్టోబర్ 29 బుధవారం    యెప్పటి నుండో నాలో ఈ సందేహం కలిగేది? ఏమిటో చెప్పకుండా కొత్తగా వచ్చిన ఈ బ్లాగర్ తికమక పెడుతోంది అనుకోకండి 'మానవ జన్మలో"జననం" ఎంతో ఉత్క్రుష్టమైనది చెప్పబడిందేగాని "మరణం" ఎందుకు అలా చెప్పబడలేదు". అందుకేనా ప్రస్తుత కాలంలో 'మరణం" అనే ఘడియానుకోండి ఘట్టమనుకోండి చాలా ధుర్భరంగా గోచరిస్తుంది. మొదలులోనే ఈమెవరు? మరణం గురించి వ్రాస్తుంది అనుకోకండి. ఈరోజు అనుకోకుండా "దేవస్థానం" అనే కొత్త తెలుగు సినిమా చూసా. పాపం సినిమా ఆడలేదు, కానీ సినిమాలో స్పౄశించిన  అంశాలు బాగా నచ్చాయి.నిజంగా ముందు ముందు మనిషి మనుగడే కాదు మరణం,మరణానంతర క్రియలు సక్రమంగా జరుగుతాయా అనే సందేహం కలుగక మానదు ఈ సినిమా చూసిన తరువాత. కర్మచేయమని, చేసేవారి కోసం వెతుక్కునే పరిస్తితులు రాబోతున్నాయని నాకనిపించింది. నాకు మరో భయం కూడా వేసింది "కర్మ" అనే ప్రక్రియ వ్యాపార వస్తువుగా మారుతుందేమోనని . పుణ్యకాలమైన ఈ కార్తీక మాసంలో ఈ సంఘటన శివ సంకల్పంగా భావిస్తాను. అటువంటి పరిస్తితులు రాకుండా పరమేశ్వరుడే మానవాళిని కాపాడాలి. అందుకు మానవ సహకారంకూడా ఉండాలి అంటాను, ఏమంటారు !      
                                                                                                                                        

1 comment:

  1. కాల సహజంగా మార్పులొస్తాయి. మరణానంతరం ఏ జరుగుతుందనేది అనవసరమేమో!

    ReplyDelete