కార్తీక మాసం

కార్తీక మాసం

Wednesday 10 June 2015

బేబీ ఆలూ ధం బిర్యానీ:





లక్ష్మీస్ మయూఖ కూడా వంటల పోస్టు పెట్టేసిందోచ్.అవునండీ ఈ రోజు నేను నా స్వంత వంట అంటే(నా ప్రయోగం)అనమాట.అదే చేశా.ఎప్పుడో ప్రయత్నించి విజయవంతమైనతరువాత ఇన్నాళ్ళకు నా బ్లాగులో పెట్టాలనిపించింది.చదివిన వాళ్ళు మీ స్పందనలు తెలియ చేస్తారనుకుంటా.ఏముంది ఓ కామెంట్ పడేస్తే సరి.

   ఇక తయారు చేసే విషయానికి వస్తే,

  తయారీ విధానం: 1/2 బాస్మతి బియ్యంలో లవంగాలు ఓ 5,దాల్చినచెక్క చిన్న ముక్కలు ఓ 3,యాలకులు ఓ2,బిర్యానీ ఆకు,పుదీనా కొంచెం,జాపత్రి 3 రేకులు ఓ పావు స్పూన్ ఉప్పు వేసి బియ్యాన్ని సగమే ఉడికించుకోవాలి.

    దానికంటే ముందు చేయవలసినది చిన్న చిన్న ఆలూలు దొరుకుతాయ్ వాటినే బేబీ ఆలూలు అంటారు. వాటిని ఉడికించి పొట్టు తీసి వాటికి ఫోర్క్తో కొంచెం గుచ్చి,వాటికి 2కప్పుల పెరుగు,జాజికాయ పొడి 2చిటికెలు,లవంగాలు,చెక్క,యాలకుల పొడి ఓ1/2 స్పూన్,1/2 చెక్క నిమ్మరసం,కారం 1 స్పూన్,మిరపకాయాలు 2 చీల్చినవి,1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,పుదీనా కొంచెం,ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు ఓ 2 స్పూన్లు కలిపి ఓ 1/2గంట నాన నివాలి.

    అరగంట తరువాత ఓ వెడల్పాటి,మందంగా ఉన్న గిన్నె(ఫ్రై పాన్)తీసికుని దానిలో 2 స్పూనుల నెయ్యి లేదా రిఫైండ్ ఆయిల్ వేసి వేడి ఐనతరువాత కొంచెం జీడిపప్పు వేయించి తీసికుని,మిగిలిన దానిలో మనం నానపెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని వేసేయ్యాలి. ఓ నిముషం ఉడికినతరువాత,దానిపైన మనం ముందుగా సగం ఉడికించిన బియ్యం వేసి పైన మరలా వేయించిన ఉల్లిపాయలు,జీడిపప్పు,కొంచెం పుదీనా,కొత్తిమీర,పైనకూడా ఓ స్పూన్ నెయ్యి వేసి మూత గట్టిగాపెట్టి(కుక్కర్ ఐతే వైట్ పెట్టి,మూత బిగించాలి)ఓ పదినిముషాలు తక్కువమంట మీద వుంచి తరువాత దానినే మందపాటి రొట్టెల పెనం స్టవ్వుమీద వుంచి మొత్తం మంట తగ్గించి దానిపై గిన్ని ఉంచి ఓ 30 నిముషాలతరువాత తీస్తే పైన తయారు చేసిన బేబీ ఆలూ ధం బిర్యానీ తయార్.
     దానిలోకి కూర ఏమి చేశాననుకున్నారు.ములగకాడలు,జీడిపప్పు,టమోటా కుర్మా.పెరుగు పచ్చడి తెలిసిందే.ఇక కుర్మా తయారీ  అంటారా మరో పోస్టులో చెప్పుకుందాం. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తూ

                             
                   
                      

No comments:

Post a Comment