కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 10 February 2015

కరిగిపోయే కాలం:

       ఈ సృష్టిలో కాలమంత కాటిన్యమైనది మరొకటి లేదనిపిస్తుంది.అనిపిస్తుందేమిటి..అదే నిజం.కాదని ఎవరినైనా అనమనండి...అదే నిజం.మనం చదువుకునేదశలో గురువులు చెప్తూ ఉండేవారు,"కాలాన్ని వృధా చేసికోకండి,ధనం పోతే సంపాదిమంచుకోవచ్చు,కానీ కాలం తిరిగి రాదని".అప్పుడు ఆ దశలో చాలా తేలికగా తీసికుంటాం.మనమూ ఒక్క జీవితంలో ఓ దశకి చేరుకున్నాక అనిపిస్తూ ఉంటుంది"అప్పుడు అలా చేసిఉండల్సిందికాదు,ఇలాచేయవలసింది అని".కానీ ఆ  క్షణాలు మళ్ళీ రావుగా. ప్రతీ మనిషీ ఏదో ఒక క్షణంలో వాళ్ళు బయటపడినా,పడకపోయినా,ఏదో ఒక సంధర్భంలో ఇలా అనుకోకుండా వుంటున్నారా అంటే?లేరనే చెప్పాలి.

      కాలం,వాయిదా అనేవి బద్ద శత్రువులు.ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నవి.దేన్ని ఎప్పుడు చేయాలో అప్పుడే ముగించాలి.కాలం,క్రియ అనేవి మంచి మిత్రులు.చూడండి మనందరివిషయంలోనే చూద్దాం,అన్నీ పనులు వాయిదా వేయకపోయినా ఎప్పుడో ఒకపనినైనా చేయవలసిన సమయంలో చేసిఉంటాం.దానిని తిరిగి మనం చూడవలసిన అవసరం ఉండదు.అలా కాకుండా వాయిదావెస్తూ పోతున్న పనులు రాకాశిలా పెరిగి మనలను మనశ్శాంతి లేకుండా అశాంతికి గురిచేస్తుంది.కూర్చున్నా అదేద్యాస,నిల్చున్నా అదే ద్యాస.దేనిమీదా ఏకాగ్రత కుదరదు.ఏపనిమీద సైగా దృష్టి పెట్టలేము.దేనినీ మనస్పూర్తిగా అస్వాదించలేము.పోనీ వాయిదావేసిన పనిసంగతి ఇప్పుడు చూద్దామంటే పరిస్తితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.దీనితో పక్కనవారిపై అసహనం,అక్రోశం,ఆగ్రహం(పుణ్యానికి వచ్చేదేగా).ఇన్నిటికి కారణం కాలం విలువనెరుగకపోవడం.ఒక తరం నుండీ మరో తరం దీనినే వారసత్వంగా తీసికుంటున్నామేగానీ,ఏతరమూ అసలు విస్మరించిన దానిని సరిదిద్దు కోవటంలేదు.ఇది మానవ నిర్లక్ష్యమా?లేక కాలం యొక్క కాటిన్యమా?అనిపిస్తుంది.విద్య,విఙానంలో అభివృద్ధి సాధించినా ఈ ఒక్క విషయంలో మనిషి తప్పటడుగు వేయకుండా ఉండలేకపోతున్నాడు.

     నా సంగతే చూద్దాం.నేను ఏడవతరగతి చదువుకునే రోజుల్లో మా ప్రధానాచార్యులు రోజూ ప్రార్ధన సమయంలో ఒక మంచి మాట చెప్పే వారు.అందులో ఆయన చెప్పిన మాటల్లో నాకు బాగా గుర్తుండి పోయినది,నేను ఇప్పటికీ ఆచరించేది చెప్తున్నా,"నేటి పని నేడె".నాకు చాలా ఇష్టమైన వ్యాక్య.ఆ ఒక్క మాట నాటి నుండీ నేటి వరకూ నా పరిది వరకూ ఆచరిస్తూ వచ్చా.అబ్బో ఐతే మీకు ఎటువంటీ ఇబ్బందులూ వుండి వుండకపోవచ్చు అనుకోకండి.అనుకుంటే పప్పులో కాలేసినట్లే.మనం పాటిస్తేనే చాలదు.మన చుట్టూ వాతావరణం కూడా అందుకు సహకరించాలి.ఏ ఒక్కరి సహకారం లేకున్నా తిరిగి మామూలే.కానీ గృహిణిగా నా పనులు మాత్రం ఎప్పటివప్పుడే చేసి ఉంచుకోవటంలో సఫలీకృతురాలినే.దేనికీ ఎవరినీ నిరీక్షించనీయను.తగుసమయంలో,వీలైతే ముందే పూర్తిచేస్తా.కానీ ఇవే కాదుగా జీవితానికి.ఇంతకంటే ముక్యమైన కార్యాలు ఎన్నో వుంటాయ్.వాటిలో ముందుంటే గురువుగారు చెప్పినదానిని నూటికి నూరు శాతం నేను ఆచరించాను అనే సంతృప్తి ఉంటుంది.ఇవన్నీ కాలమే ఆడిస్తుంది.ఇవన్నీ ఆలోచించుకుంటూ వుండేలోపు కరిగిపోతూనే ఉంటుంది కాలం.లక్ష్యం ప్రశ్నార్ధకంగా మనముందు నిలబడుతుంది.అప్పుడు ఆదుర్ధా పడి ఏమీ చేయలేము,చేసినా సంతృప్తికరంగా చేయలేం. కనుక ఎప్పటి పనిని,అప్పుడే ముగించు కోవటం ఉత్తమం.కాలం ఎవరికీ చుట్టం కాదు.ఎవరికోసం ఆగదు.అది చూపించే చిత్రాలు చూడటానికి చివరికి మనిషికి ఓపిక కూడా ఉండదు.చెప్పానుగా కాలానికున్నంత కాటిన్యం ఎవరికీ ఉండదు. నిర్ధక్షిణ్యంగా జీవితాలు జీవితాలను చిదిమేస్తుంది.ఆనక సరిదిద్దుకుందామనుకున్నా దారే దొరకదు.పరిష్కారం దొరకదు.

    ఇంతకూ నేను చెప్పోచ్చేదేమిటంటే మిత్రులారా(నా పోస్టు చదివిన వారు)ఎంతోమంది చెప్పారు కదా మీరెంత,మీరెవరు అనుకోకుండా,కాలం విలువ గుర్తెరగండి.ఇది ఏ విధ్యార్ధులకో చెప్తున్నాననుకోకండి.అందరం అన్ని వయసుల వారం,ఎవరం వారి వారి పనులను ఎప్పుడు పూర్తి చేయాలో అప్పుడే పూర్తి చేద్దాం.ఆనక పరుగులు తీయలేం.మొదలు "వాయిదా వేయటాన్ని" తీసేద్దాం.కాలమనే రక్కసి కోరలకు సాద్యమైనతవరకూ దొరక్కుండా తప్పించుకోవటానికి ప్రయత్నిద్దాం. సాద్యంకాకపోయినా ఓపిక ఉన్న సమయంలోనే మన భాద్యతలు పూర్తిచేసి ఆ తరువాత మీకు తెలిసిందే కదా తామరాకు,నీటి బొట్టు.అలా జారి పోవాలి.అదే ఈరోజు మీకు చెప్పాలనిపించింది.అందరివిషయంలో ఇలాగే జరగాలని కోరుకుందాం.

         

No comments:

Post a Comment