కార్తీక మాసం

కార్తీక మాసం

Monday 23 February 2015

నవయువతా మేలుకో:

                సరైనయువతకు ఇప్పటికి అర్ధం ఐపోయివుంటుంది అసలు రాజకీయం అంటే ఏమిటో.యువతలో సరైన యువత ఏమిటని ఆశ్చర్యపోకండి అలానే అనాలి కూడా,మరి ఈరోజుల్లో ఎంతమంది యువకులు భాద్యతగా ఆలోచించగలుగుతున్నారు,(మహిళల్లోనైనా),చేసే చేతల్లో బాద్యతలేదు,చేసె ఆలోచనల్లో భాద్యతలేదు.ఎదుటివాడు తమను సమిధలుగా వాడుకుంటున్నాడని,తమ విద్యాకాలాన్ని వారి స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుంటున్నారని తెలిసికోలేక ఎంత సమయం వృధాచేసికుంటున్నారో కదా. ఐతే రాజకీయాలపై ఆసక్తి ఉండి సేవే ద్యేయంగా పనిచేస్తానికే రాజకీయాల్లోకి వచ్చే యువత ఎంతశాతముంది అంటే లేదనే చెప్పాలి.గ్రూపులు నడపడం,ఎవరోఒకరికి కొమ్ముకాస్తూ,పంచాయితీలుచేస్తూ రాజకీయంగా ఎదుగుతున్న యువతనే నేడు సమాజంలో చూస్తున్నాం.ఇలాంటి కొత్త తరమా మనం కోరుకునేది.ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయింది ఇకనుంచైనా కొత్తగా ఆలోచించే నవయువత ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందనుకుంటే పాత సీసాలో కొత్త సారాలాగా ఐపోయింది.గమనిస్తూనే వుంది సరైన యువత.అధికారంలోవున్న పార్టీ తన పాలనా కాలంలో అందినంత దండుకోవడం,ఎవరో ఒకరు జైళ్ళ పాలు కావడం,కేసులు నడుస్తూ వుంటాయ్ సంవత్సరాలతరబడి అలా సాగి సాగి ఈలోపు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది గతపార్టీ చేసిన తప్పులను ఎండగడుతూ,దేశంలో సినీ,ఇతర రంగాలలోవున్న ప్రముఖులని ప్రవేశపెట్టి,జనాలను ఉద్రేకపరచి,అధికారంలోకి రాగానే వారిని అదిచేస్తాం,ఇదిచేస్తాం అంటూ పీఠం ఎక్కుతుంది.తిరిగి షరా మామూలే.మొదట్లో చిత్రాలు చేస్తూ అసలు నిజాయితీకి మేమేరూపాలమంటూ ప్రకటించుకుంటున్నారు.నెమ్మదిగా తమ నిజస్వరూపాలను చూపుతూ నిజాయితీ అనేతొడుగును నెమ్మదిగా వదిలించుకుంటున్నారు.అది స్వచ్చంగా నేడు కానవస్తుంది.ఈ కాలంలోనే గతప్రభుత్వాల కుంభకోణాలను తెరమీదకితెచ్చినట్లు మనకి భ్రమలు కలిగిస్తారు.లోపల జరిగే వాళ్ళ వాళ్ళ లాలూచీలు వారు పడి అలా సాగతీస్తారు.మరలా మామూలే ఈ ప్రభుత్వలోటుపాట్లను ప్రతిపక్షమెండగట్టడం,గలాటాలు సృష్టించడం,దానికీ విద్యార్ధులనే ముందుకుతెస్తున్నాయ్.ఆవేశపరులంటే యువత అని వారికి బాగా నమ్మకం.దాన్ని బాగా వాడుకుంటున్నాయ్ నేటి రాజకీయ పార్టీలు.కానీ విద్యార్ధిలోకమే ఈ చిన్నా విషయాన్ని గమనించటంలేదో లేక ప్రలోభాలకు లొంగో తమ విలువైనకాలాన్ని వృధా చేసికుంటున్నారు. ఎప్పటికి మార్పువస్తుందోనని మాలాంటి పూర్వపు యువత కలత చేందుతుంది.గతంతో పోలిస్తే కొద్దిగా మార్పు వచ్చిందనే చెప్పాలి.దాని పర్యవసానమే ఈమద్య మనం ఓ ప్రభంజనం ద్వారా చూశాం.నీతులు చెప్పటం కాదు అందుకు కడదాకా కట్టుబడి ఉండాలి లేకుంటే జనం వెనక్కి పంపుతారని మనదగ్గర ఓ ప్రాంతీయ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది.అలానేఉంటుంది యువత తలుచుకుంటే. 

       చివరిగా అందరిలో ఒకరిగా నేటి యువతకు నేను చెప్పోచ్చేదేమిటంటే మీ విలువైన కాలాన్ని ఎవరికోసం వృధాచేసికోవద్దు,కాలం ఎవరికోసం ఆగదు,మీ భవిష్యత్తు కోసం మీతల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని,వాటికోసం ఎన్నో త్యాగాలు చేశారు.అవి మరిచిపోవద్దు. సమాజంకోసం భాద్యతగా ప్రవర్తించాలి కాదనం,ముందు ఇల్లు చక్కదిద్ది,అనంతరం సమాజం.ఇళ్ళుబాగుంటేనేకదా సమాజం బాగుండేది. బంగారంలాంటి మీ భవిష్యత్తును వాడుకుని ఎవరోకాదు,మన తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోండి.వారి కలలను నెరవేర్చండి.అంతేగానీ స్వార్ధపూరిత రాజకీయరొంపిలోకి దిగి మీ భవిష్యత్తు పాడుచేసికోవద్దు.మీరేకనుక తలుచుకుని శ్రద్దపెడితే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు.దానికోసమే భావి లోకం ఎదురుచూస్తుంది.

      సర్వేజనా సుఖినోభవంతు.     

No comments:

Post a Comment