కార్తీక మాసం

కార్తీక మాసం

Wednesday 11 March 2015

ఓ నాన్నా నీ మనసే వెన్న:

     నాన్నా నీవే గుర్తుకువచ్చావ్ నాన్నా.మొన్న ఆదివారం నేను చాలారోజులతరువాత బీసెంట్రోడ్డుకు వెళ్ళా.కేవలం నీతో నేను కలసి తిరిగిన ఙాపకాలను నెమరువేసుకునేదుకే వెళ్ళా. తిరిగినంతసేపూ నువ్వు నాపక్కనేఉండి అదివరలోలా నాతో మాట్లాడుతున్నట్ల్లే అనిపించింది. అదే రోడ్లో ప్రతీ మూలా వెతికా నాన్నా నెవు ఎక్కడన్నా కనబడతావెమోనని.నా పిచ్చి గానీ ఐదు సంవత్స్రాలక్రితం నన్ను వదిలివెళ్ళిన నీవెలావస్తావ్. ఐనా నాకెందుకో ఆశ చావటంలేదు. మా నాన్న ఇక్కడే ఎక్కడో వున్నారని మొత్తం కలియతిరిగా. నువ్వు పచారి సరుకులు కొనే లక్ష్మీ జనరల్ స్టోర్లో చూసా.మీ అల్లుడుకి కూడా చెప్పా.అక్కడే మా నాన్న సరుకులు తీసికునేవారని,సరుకులతోపాటు ఓ పావు కేజీ జీడిపప్పు విడిగా కొని మాకు పెట్టేవారని. మానాన్న ప్రేమకు హద్దువుండేది కాదని చెప్పా. ఆయనకు కూడా బాగా గుర్తుకువచ్చారు నాన్నా.మోడ్రన్ కేఫ్కి తీసికువెళ్ళారు. అంకుల్ ఇక్కడే నాకు కాఫీ ఇప్పించేవారు.చాలా బాగుండేది అని ఆయన అనేటపుడు ఆయన కళ్ళలో తడి నేను చూసాను నాన్నా. ఇప్పటికీ ఆయన అంటున్నారు నాన్నా "నా జీవితంలో నేను ఎరుగని రుచులు, నా తండ్రి కూడా చూపించని రుచులు మా అంకుల్ నాకు నేర్పారు అని.ఏది మెరుగో అదే మాకు పెట్టారు అని కూడా అంటున్నారు నాన్నా. నీవు మాకూ అలానే ఇచ్చావ్ అన్నీ. కొన్ని తప్పిదాలు జరిగినా నీఆలోచనావిధాన వేరుగా ఉండేది కదా నాన్నా.మొన్న మీ మేనమామ వచ్చారు మా ఇంటికి.ఆయనకూడా ఇదే చెప్పారు "వాడి ఆలోచనావిధానమే వేరు,దాన్ని అర్ధం చేసికునేవాళ్ళు బహు తక్కువమంది వుంటారు.వాడికి మంచి అనిపించినది ఎవరు అడ్డుపడినా చేసేస్తాడు,ఎవరిగురించీ ఆగడు" అని.ఇక ఆరోజు బజార్లో తిరుగుతున్నంతసేపూ నిన్నే తలుచుకుంటూ ఉన్నాం.మేము ఏమీ కొనలేదు.కేవలం నీఙాపకాలను నెమరువేసికునేందుకే వెళ్ళాం.కార్ పార్కింగ్ దగ్గరనుంచీ నీ మాటలే.వెనుక రెడ్డయ్యగారు కూడా గురుతుకువచ్చారు. నీవు డయాలసిస్ చేయించుకునే దశలో నిన్ను చూసి రెడ్డయ్యగారు చాలా బాధ పడ్డారు. నాతో అన్నారు. చాలా వేగంగా నడిచేవారమ్మా.రెడ్డయ్యగారూ మా అమ్మాయి వస్తోంది ఆమె వస్తువులు రేడీ అయినాయా? అని,మరలా ఏదో చేపించుకోవాలనుకుంటుంది,ఆడపిల్లల తల్లికదా,నేను ఒక్క పిల్ల ఐనా నా పరిస్తితులలో నేను చేపించలేకపోయానండీ.మా అమ్మాయికి ఇద్దరు పాపలు,ముందు ముందే అన్నీ వుంచుకోవాలని,నాలా చేయకూడదని తాపత్రయం అని చెప్పేవారటగా నాన్నా.రెడ్డయ్యాగారే చెప్పారు. ఇన్ని చెప్పి,నిన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్న ఆయన నీకంటే ముందే అదే కిడ్నీల సమస్యతో చనిపోవటం నాకు చాలా బాధగా ఉంటుంది నాన్నా.అక్కడికి వెళ్ళగానే ఆయనకూడా గుర్తుకువస్తారు.రా అమ్మా నాన్నగారు అమ్మాయి వస్తదని చెప్పారు.ఎప్పుడు వచ్చారమ్మా అని చాలా ఆప్యాయంగా పలుకరిచేవారు.ఆయనా లేరు.విజయవాడ వస్తే నీ స్నేహితులు కానీ బంధువులు కానీ నీ గురించీ తలిస్తే నేనసలు తట్టుకోలేకపోతున్నా నాన్నా.శ్రీ రామా స్వీట్స్ చూసినా నీ గుర్తులే.నాతో పేచీ పెట్టుకుని మరీ అక్కడ స్వీట్స్ తిన్నావ్. నేను ఏడ్చినా నీవు ఆ స్వీట్స్ తినటం మానేవాడివికాదు.అదేమంటే స్వీట్స్ తినే వారికి కపటం తెలియదని సెలవిచ్చేవాడివి.నన్ను మీ అమ్మనని అనే వాడివికదా.నేను నిన్ను చిన్నతనంలో వదిలి వెళ్ళానన్ని నన్ను త్వరగా వదిలివెళ్ళావా నాన్నా.నాకు చాలా భాద్యతలున్నాయ్ నాన్నా.ఎలా వాటిని తీర్చుకోవాలో చెప్పటానికి నీవెక్కడ.నాకేమీ పాలుపోవటంలేదు.చీకటిలో దీపంలేకుండా గమ్యానికి నా ప్రయాణం ఎలా నాన్నా.ఇంత నిర్ధయగా నన్నెందుకు వదలివెళ్ళావ్?.మీ అమ్ములుకెవరున్నారు.అన్నీ నీవేకదా.నీ మనుమరాళ్ళుకూడా నీవులేని విజయవాడలో ఉండలేమంటున్నారు. నీవులేని లోటు అన్ని చోట్లా కనబడుతోంది.నాకు మాత్రం చాలా లోటు.నాకు నీవే లోకం నాన్నా.ఇంకా నీవులేవంటే నమ్మబుద్ది కావటం లేదు.నాతో ఎప్పుడూ మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.నీవు పరిచయంచేసిన లోకంలో నీవులేకుండా ఉంటున్నానా అని,త్వరగా నా పనులు పూర్తిచేసికుని నీ దగ్గరికి వచ్చేయాలని అనిపిస్తుంది.నీకూ బహుశా నా బిడ్డ నేనులేకుండా ఎన్ని బాధలుపడుతుందోనని అనిపిస్తుందా.నిజమే నాన్నా నీవు లేకపోవటమే నాకు పెద్ద బాధ.మిగిలినవి వద్దు.అందరూ నన్నుచూడగానేఅ నువ్వే గుర్తుకువస్తున్నావంటుంటే ఇంకా కుళ్ళువస్తుంది నాన్నా.నాకెందుకీరూపమిచ్చావ్.నన్నెందుకు అంతలా ప్రేమించావ్.నీవొక్కడివే నాకు అందరి ప్రేమను ఇచ్చావ్. అందుకే అంతలా గుర్తుకువస్తున్నావ్.నేను నిన్ను మరువలేకపోతున్నాను నాన్నా.నా మాటలుకూడా నీలానే ఉన్నాయట. మీ మామయ్య అన్నారు. అచ్చు వాడిలానే మాట్లాడుతున్నవే అనేసరికి నాకు దుఖం పొంగుకువచ్చింది. నిజంగానే నువ్వు నేర్పినవే కదా నాన్నా ఎవరితో ఎలా మాట్లాడాలి,పలికే మాటలు పరుషంగా ఉండకూడదు అని,మనం మాట్లాడేదాన్ని బట్టే ఎదుటి మనిషి ప్రవర్తిస్తాడని,ఎంతటి పనినైనా,ఎంతటివాడినైనా మనం మంచి భాషణతోనే సాధించుకోగలమని చెప్పావ్. అవే నేను పాటిస్తున్నా.నీవు నేర్పినవే నేటికీ ఆచరిస్తున్నా.ఎప్పటికీ నీ కూతురుగానే ఉండి,పోతా.మనల్ని కొందరు మోసంచేసినా నీ పేరుకు తగ్గట్టుగా ఒక చెంప కొడితే మరో చెంప చూపినట్లే ప్రవర్తించాం.జరిగింది చాలా నష్టం.ఐనా భరించాం,భరించావ్.ఎప్పటికైనా నైతికవిలువలకి,ధర్మానికే విజయం అని చెప్పేవాడివికదా.నేనూ అవే నమ్ముతూ బతుకుతున్నా.ఇలా అనుక్షణం నాకు ప్రతీ చోటా గుర్తుకువస్తున్నావ్. నీవే నా శక్తి,బలం నాన్నా.నావెనుకే వుండు నాన్నా.నాపనులు పూర్తైనవెంటనే నీదగ్గరికి వచ్చేస్తా.నాకెవరూ వద్దు నీ చల్లని చేయి చాలు,నీవు పిలిచే పిచ్చి సచ్చు అనే ఆ పిలుపు చాలు.

      ఎప్పటికీ నీ ఙాపకాలతో నీ అమ్ములు అనబడే పిచ్చి సచ్చు.

2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. మీ తండ్రీబిడ్డల అనుభూతులను బాగా గ్రంథస్థం చేసారు. భావోద్వేగం బాగా వ్యక్తం ఐనది, కాని ఎవరి జీవితం వారిదే అన్నదే కఠోరనిజం. తట్టుకొని రాటుదేరక తప్పదు.

    ReplyDelete