కార్తీక మాసం

కార్తీక మాసం

Thursday 12 February 2015

ఏమైపోయినవా పత్రికలు:

        మా చిన్నతనంలో అమ్మ,నాన్న చదివే ఆంద్ర సచిత్ర వార పత్రిక,అమ్మ,అమ్మ స్నేహితులు చదివే వనితా జ్యోతి అనే మహిళా మాస పత్రిక,మా పిల్లల కోసం బాలమిత్ర,బాల జ్యోతి,సినిమాలకు సంబందించిన విజయ చిత్ర,జ్యోతిచిత్ర,శివరంజని వంటి పత్రికలేమై పొయాయ్.దయచేసి తెలిస్తే ఎవరైనా తెలుపగలరు.వనితా జ్యోతి నేను పదవతరగతికి వచ్చేవరకూ వుంది.చదివానుకూడా.మంచి మంచి అంశాలుండేవి.పుస్తకం కూడా చాలా బాగుండేది.తరువాత చదువులు,పెళ్ళిళ్ళులో పడి ఈ పుస్తకాలగురించి తెలియలేదు.ఇప్పుడు కాస్త వీలుచిక్కి చదువుదామనుకుంటే మంచి పత్రికలేవీ లేవు.వున్నవంత బాగుండలేదు.ఆంద్రభూమి లో కూడా మల్లిక్ గారి జోకులు,హాస్యభరితమైన ధారావాహికలు వచ్చేవి.అవి కూడా బాగావుండేవి.తరువాత పల్లకి,రచన అనే పుస్తకాలు కూడా చదివాను.బాగుండేవి.తరువాత అవీ కనబడ లేదు.అవేవుంటే ఈ టివిలలో చెత్త ధారవాహికలు చూడాల్సిన భాదవుండేది కాదు.కాస్త పత్రికా పఠనంవలన గృహిణులకి ఙానం పెరిగేది.అదీ లేకుండాపోవటంతో పఠనాశక్తి తగ్గిపోయింది.కళ్ళుమాత్రం ఆ టివికి అతికిస్తున్నాం.ఎన్నాళ్ళు చూస్తాం అవి మాత్రం.ఎంతైనా పత్రికలకు సాటి మరే రంగం లేదని నాకనిపిస్తుంది.

     సరే ఎటో ఎటో వెళ్ళి పోతున్నా.చెప్పదలచుకున్నది,ఆశగా ఎదురుచూసేది మరలా అలాటి సాహిత్యాలతో కూడిన పత్రికలు వచ్చి మరలా పాత రోజులు రావాలని.ఎందుకంటే "పాతవెప్పుడూ బంగారమే".వాటి ద్వారానైనా విలువలకు ప్రాణం పోసినట్లౌతుందని. దయచేసి విలువలగురించి వ్రాస్తే ఎవరు చదువుతారని అనవద్దు.చదివే వారున్నారు,వుంటారు ఎప్పటికీ.పాలల్లో నీళ్ళు కలిసినంత మాత్రాన పాలన్నీ నీళ్ళైపోవుగా.పాలు పాలే,నీళ్ళు నీళ్ళే.ఏమంటారు?.  

2 comments:

  1. "రచన" ఇప్పటికీ వస్తోదండి. మొత్తంమీద మీరు వ్రాసింది మంచి నోస్టాల్జియా.

    ReplyDelete
  2. 'చందమామ' అని నెలవారీ వచ్చే పిల్లల కథల పుస్తకం వచ్చేది....ఇప్పుడుందో లేదో....

    ReplyDelete