కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 27 January 2015

అన్నలూ తప్పక చూడండి:

           ఈ రోజు ఈటివిలో ప్రసారమైన ఝుమ్మంది నాదం కార్యక్రమం ప్రతీ అన్న,చెల్లెలు చూసి తీరాలి.బాలు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ పెళ్ళి చిత్రంలోని పాట "చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే,నాకు నువ్వే"శ్రీ కృష్ణ అద్భుతంగా ఆలపించాడు.సాహిత్యమంతా విన్న వాళ్ళకి కన్ను చెమ్మగిల్లక మానదు.అదే వేదికపై బాలు,శైలజ గార్ల అనుబంధాలు,వారి చిలిపి అల్లరి,"అన్న అంటే అన్న ప్రశ్నకి శైలజ నాన్న అని "సమాధానం చెప్పినపుడు చెప్పనలవికాని బాధ కలిగింది.అందుకు బాలూ గారూ మురిసిపోయారు.అది వేరే విషయం. ఇప్పటి రోజుల్లో ఒక అన్న చెల్లి "నాకు నాన్న లేరు కదా నువ్వే కదా నాకు అన్నీ అని అంటే" ఆ అన్న చెప్పినదేమిటో తెలుసా,"నాకేం సంబంధం,నేను కన్నవారికి మాత్రమే నేను బాధ్యుడను.నిన్ను నాన్న కన్నారు,ఇప్పుడు ఆయన లేరు,నాకేం సంబంధం లేదు అని.ఆ చెల్లి ఆ అన్న ఆస్తులేమీ అడగలేదు అక్కడ.నాన్న ఇచ్చే ఓదార్పే అడిగింది.ఆ చెల్లి అటువంటి అన్నలకి అన్నీ చేసింది.అప్పుడు ఆ చెల్లి నాకేమి సంబంధం అమ్మ కదా మిమ్మల్ని కన్నది అని అడుగలేదు. ఈ రోజు చెల్లి ఆ అన్న పై మాట అన్నపుడు అంటే దానికి కూడా ఆ అన్న చాలా తెలివిగా సమాధానం చెప్పాడు.ఏమని అంటే ఇంటిలో ఆడపిల్లవి కదా పనులు నేర్చుకోవాలి కనుక అందులో భాగంగా చేశావైనా అవన్నీ, నువ్విపుడు అడుగకూడదని ఆ చెల్లిని దూరంగా పెట్టేశారు.అన్నలే అనుకుంటే పరవాలేదు ఆ చెల్లిని కన్న తల్లి కూడా స్వార్ధంతో బిడ్డను దూరంగా పెట్టింది.ఆ బిడ్డ మెట్టినిల్లు చేరేవరకూ అనారోగ్యపరురాలైన తనుకు చేసిన సపర్యలు కూడా మరిచిపోయింది.ఆడపిల్లవికనుక పనిపాటలు నేర్చుకునే పనిలో భాగంగా మాకు చేశావ్ అని నిర్ధయగా మాట్లాడింది.ఆ కూతురు ఆ తల్లి మాటలు విని జీవితంలో చాలా కోల్పోయింది.ఏమిటో ఆ తల్లికి తెలుసు.కానీ ఒప్పుకోదు.కారణం స్వార్ధం. ఆమే ఎప్పుడూ చెప్తూ ఉండేది "కలికాలం,కడిగేసుకుపోయే కాలమని".దానికి ఆమె కూడా తలవంచింది. 

        ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోకమంతా పైవిధంగా లేదని బాలూ గారు,శైలజగార్లను చూస్తే అర్ధమైంది.పోనీలే కొంతైనా నీతి,నిజాయితీ,ప్రేమలు,అనుభంధాలు మిగిలిఉన్నాయని అనిపించి కళ్ళు చెమ్మగిల్లినయ్.

        పైన చెప్పిన అన్నలు,చెల్లి,తల్లి కధకు భిన్నమైన కధ మరో పోస్టులో తెలిసికుందాం.ఇప్పటి వరకూ కల్తీ లేని ప్రేమ తల్లి ప్రేమ అని నమ్మినవాళ్ళకి పైన చెప్పిన యదార్ధ సంఘటనే, లేదు తల్లి ప్రేమ కూడా కల్తీనేనని రుజువు చేసింది.

        అందరూ మళ్ళీ తప్పకుండా చూడండి ఆ కార్యక్రమాన్ని.   

No comments:

Post a Comment