కార్తీక మాసం

కార్తీక మాసం

Monday 15 December 2014

మరువలేని బాపూ చిత్రం:

         ఈ రోజు బాపూగారి జన్మదినం. టివిలలో ఆయన సినిమాలు చూసినపుడల్లా అనిపిస్తుంది ఆయనెక్కడికీ పోలేదు, ఆయన గీసిన చిత్రాలు,తీసిన సినిమాల ద్వారా మనతోనే ఉన్నారని.నాకు ఊహతెలిసినతరువాత చూసిన ఒక వారపత్రికనుకుంటా దానిలో "ముత్యాల ముగ్గు"సినిమా టైటిల్ వేసివుండేది. చూస్తే మళ్ళీ చూడాలని అంతచిన్న వయసులోనే ఉండేది. అంత ఆకర్షణగా ఉండేది ఆయన లెటరింగ్. దాని ప్రభావమో లేక నాన్న ప్రభావమో తెలియదుకానీ అక్షరాలు దిద్దేటప్పటినుండీ నా దస్తూరి చాలా బాగుండేది. మానాన్నగారు చాలా మురుసుకునేవారు. ముత్యాల్లావ్రాస్తానని.స్కూల్లో కూడా టీచర్లు మెచ్చుకునేవారు. బొమ్మలు కూడా బాగా వేసేదాన్ని. ఇవన్నీ బాపూగారంటే అంతచిన్నతనమునుండీ అభిమానమేర్పడటం వలనైవుండవచ్చు. నా 8వ తరగతిలో ముత్యాల ముగ్గు సినిమా చూసా.నాకు చాలా చాలా నాచ్చేసింది. ఇప్పటికీ నా మూడ్ బాగొకపోతే "ముత్యాల ముగ్గో" లేక "గోరంత దీపమొ" చూస్తా. చివరికి ఫ్లాప్ సినిమా "కల్యాణ తాంబూలం" కూడా ఓపికగా చూస్తా.అంతర్లీనంగా చాలా మంచి మాటలు,చిత్రీకరించే విధానం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అలా బాపూ గారిపై అభిమానంపెరుగుతూనేవచ్చింది. చివరికి స్నేహం విషయంలో కూడా నాకూ ఆఇద్దరే స్పూర్తి.నాకో నెచ్చెలి ఉంది. మా పరిచయం 28 సం లు. అలాగే మాస్నేహం కూడా కొనసాగాలని కోరుకుంటూ ఉంటా. మొన్న రమణగారు వారిని వెతుక్కుంటూనిన్న బాపూగారు  వెళ్ళిపోయారు. కానీ వారి మనకు ఇచ్చిన చిత్రాలు,నిర్మించిన కళాఖండాల ద్వారా ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. వారిని స్మరించుకుంటూ అద్భుతమైన,అచ్చతెనుగు పాటనోసారి వీక్షించండి.చూసి మీ అభిప్రాయాలు చెప్పండి.             

No comments:

Post a Comment