కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 23 December 2014

బాలచందర్ గారికివే నా నివాళి:

         బాలచందర్ గారు మీరులేని లోటు ఎవరు తీర్చాలి.ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోయారు.మద్యతరగతిమనిషిని మీరుచదివినంతగా ఎవరూ చదవలేదోమోనని మీ సినిమాలు చూస్తూవుంటే అర్థమయ్యింది. చిన్నతనంలో "అంతులేనికధ" అర్ధంకాలేదు. అర్ధమయ్యాకా ఎన్నిసార్లు చూసామో."కల్కి" చూసి ఎంతగా కదిలిపోయామో."కోకిలమ్మను" ఇంకా మరిచిపోలేదు."మరోచరిత్ర" ఎప్పటికీ కొత్త చరిత్రగానే అనిపిస్తుంది.ఆనాడుమీరు చూపిన "ఇది కధ కాదు" ఇంకా నడుస్తూనేవుంది."ఆకలి రాజ్యం చూసి"ఆకలి అర్ధం,బతుకు,బాద్యతలు తెలియచేసావ్."తూర్పూ పడమర" ఏమిటో ఇంకా అర్ధం కావటంలేదు.మీరు చిత్రీకరించిన సినిమాలన్నీ ఒక 'అందమైన అనుభవాలు"."కాసేపు ఆడాళ్ళూ మీకు జోహార్ల"మంటూ,"47రోజులు"ఒక ఆడదానికి నరకం చూపించారు.ఏమైనా మీరు లేరనేది ఒక "అబద్దం".


నాకు చాల చాలా ఇష్టమైన ధర్శకుడు కె.బాలచందర్ గారి మృతికి నా నివాళి. 

No comments:

Post a Comment