కార్తీక మాసం

కార్తీక మాసం

Friday 12 December 2014

నాన్నను గుర్తుకుతెచ్చే నాటి పాట:

చిత్రం:గాలి మేడలు

గాయకుదు:ఘంటసాల వెంకటేశ్వరావుగారు

గీత రచయిత:కొసరాజు


"మమతలులేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడుఎవరో"...ఎంతచక్కని సాహిత్యమంటే,సర్వకాల సర్వావస్థలకు దీనిభావం అన్వ యించబడుతుందని నేడు నాకనిపిస్తుంది. ఈ పాట గురించి నాన్న నన్ను బజారు తీసికెళ్ళినపుడు చెప్పారు. అప్పుడు నాకు చాలా చిన్న వయసు. కానీ నాన్న విడమర్చి అర్ధం చెప్పేవారు. అందుకేనేమో నా ఆరవతరగతిలోనే నేనీ పాటా ఓ పోటీలో పాడాను. "పాటబాగుందే,కానీ నీకెందుకే ఇంత బరువైన పాట"అని టీచర్లు అన్నపుడు మానాన్నగారికి ఇష్టమైన పాట అనిచెప్పాను. కాల క్రమేణా దాని అర్ధం జీవితంలో అన్వయించబడుతూ వస్తూంటే కొసరాజుగారు ఊరికే వ్రాయలేదనిపిస్తుంది. నాన్న పోయినా ఆయనఙాపకాలుగా చాలా పాటలున్నాయ్. సాహిత్యంద్వారా నాన్న నాకు చాలా నేర్పారు. అందుకు ఆయన ఏ పండితుడో,కవో కానవసరంలేదు.సంగీత,సాహిత్యాభిమాని మాత్రమే. మంచి కధలు,సినిమాలు,లలితగీతాలు,సినీగీతాల సాహిత్యాలపట్ల నాన్నకెంతో అభిరుచిఉండేది. అలా నాన్న నాకు పరిచయం చేసిన పాటలలొ ఇది ఒకటి.ఒకసారి వినిచూడండి.దీని లింకు కింద ఇస్తున్నాను.   

https://www.youtube.com/watch?v=EtLrqKtajbA

విని మీస్పందన తెలుపగలరు.మరో మంచి "నాన్న పరిచయం చేసిన పాట"తో కలుస్తాను.























No comments:

Post a Comment