కార్తీక మాసం

Saturday, 27 December 2014
Tuesday, 23 December 2014
బాలచందర్ గారికివే నా నివాళి:
నాకు చాల చాలా ఇష్టమైన ధర్శకుడు కె.బాలచందర్ గారి మృతికి నా నివాళి.
Monday, 15 December 2014
మరువలేని బాపూ చిత్రం:
ఈ రోజు బాపూగారి జన్మదినం. టివిలలో ఆయన సినిమాలు చూసినపుడల్లా అనిపిస్తుంది ఆయనెక్కడికీ పోలేదు, ఆయన గీసిన చిత్రాలు,తీసిన సినిమాల ద్వారా మనతోనే ఉన్నారని.నాకు ఊహతెలిసినతరువాత చూసిన ఒక వారపత్రికనుకుంటా దానిలో "ముత్యాల ముగ్గు"సినిమా టైటిల్ వేసివుండేది. చూస్తే మళ్ళీ చూడాలని అంతచిన్న వయసులోనే ఉండేది. అంత ఆకర్షణగా ఉండేది ఆయన లెటరింగ్. దాని ప్రభావమో లేక నాన్న ప్రభావమో తెలియదుకానీ అక్షరాలు దిద్దేటప్పటినుండీ నా దస్తూరి చాలా బాగుండేది. మానాన్నగారు చాలా మురుసుకునేవారు. ముత్యాల్లావ్రాస్తానని.స్కూల్లో కూడా టీచర్లు మెచ్చుకునేవారు. బొమ్మలు కూడా బాగా వేసేదాన్ని. ఇవన్నీ బాపూగారంటే అంతచిన్నతనమునుండీ అభిమానమేర్పడటం వలనైవుండవచ్చు. నా 8వ తరగతిలో ముత్యాల ముగ్గు సినిమా చూసా.నాకు చాలా చాలా నాచ్చేసింది. ఇప్పటికీ నా మూడ్ బాగొకపోతే "ముత్యాల ముగ్గో" లేక "గోరంత దీపమొ" చూస్తా. చివరికి ఫ్లాప్ సినిమా "కల్యాణ తాంబూలం" కూడా ఓపికగా చూస్తా.అంతర్లీనంగా చాలా మంచి మాటలు,చిత్రీకరించే విధానం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అలా బాపూ గారిపై అభిమానంపెరుగుతూనేవచ్చింది. చివరికి స్నేహం విషయంలో కూడా నాకూ ఆఇద్దరే స్పూర్తి.నాకో నెచ్చెలి ఉంది. మా పరిచయం 28 సం లు. అలాగే మాస్నేహం కూడా కొనసాగాలని కోరుకుంటూ ఉంటా. మొన్న రమణగారు వారిని వెతుక్కుంటూనిన్న బాపూగారు వెళ్ళిపోయారు. కానీ వారి మనకు ఇచ్చిన చిత్రాలు,నిర్మించిన కళాఖండాల ద్వారా ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. వారిని స్మరించుకుంటూ అద్భుతమైన,అచ్చతెనుగు పాటనోసారి వీక్షించండి.చూసి మీ అభిప్రాయాలు చెప్పండి.
Saturday, 13 December 2014
Friday, 12 December 2014
నాన్నను గుర్తుకుతెచ్చే నాటి పాట:
చిత్రం:గాలి మేడలు
గాయకుదు:ఘంటసాల వెంకటేశ్వరావుగారు
గీత రచయిత:కొసరాజు
"మమతలులేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడుఎవరో"...ఎంతచక్కని సాహిత్యమంటే,సర్వకాల సర్వావస్థలకు దీనిభావం అన్వ యించబడుతుందని నేడు నాకనిపిస్తుంది. ఈ పాట గురించి నాన్న నన్ను బజారు తీసికెళ్ళినపుడు చెప్పారు. అప్పుడు నాకు చాలా చిన్న వయసు. కానీ నాన్న విడమర్చి అర్ధం చెప్పేవారు. అందుకేనేమో నా ఆరవతరగతిలోనే నేనీ పాటా ఓ పోటీలో పాడాను. "పాటబాగుందే,కానీ నీకెందుకే ఇంత బరువైన పాట"అని టీచర్లు అన్నపుడు మానాన్నగారికి ఇష్టమైన పాట అనిచెప్పాను. కాల క్రమేణా దాని అర్ధం జీవితంలో అన్వయించబడుతూ వస్తూంటే కొసరాజుగారు ఊరికే వ్రాయలేదనిపిస్తుంది. నాన్న పోయినా ఆయనఙాపకాలుగా చాలా పాటలున్నాయ్. సాహిత్యంద్వారా నాన్న నాకు చాలా నేర్పారు. అందుకు ఆయన ఏ పండితుడో,కవో కానవసరంలేదు.సంగీత,సాహిత్యాభిమాని మాత్రమే. మంచి కధలు,సినిమాలు,లలితగీతాలు,సినీగీతాల సాహిత్యాలపట్ల నాన్నకెంతో అభిరుచిఉండేది. అలా నాన్న నాకు పరిచయం చేసిన పాటలలొ ఇది ఒకటి.ఒకసారి వినిచూడండి.దీని లింకు కింద ఇస్తున్నాను.
https://www.youtube.com/watch?v=EtLrqKtajbA
విని మీస్పందన తెలుపగలరు.మరో మంచి "నాన్న పరిచయం చేసిన పాట"తో కలుస్తాను.
Wednesday, 10 December 2014
Monday, 8 December 2014
Monday, 1 December 2014
"ఆమె"
ఈ కవిత నాఒక్క స్వంత అభిప్రాయం మాత్రమే. ఏకీభవించేవాళ్ళుంటే స్వాగతం. వ్యతిరేఖించేవాళ్ళకి ఒకటే నా మనవి. నా అబిప్రాయం నాది.అందరూ నాలా అలోచించాలని అనుకునేదాన్ని కాదు. నా అనుభవంలో నేను తెలిసికున్నదాన్ని బట్టి నేను అలా నిర్ణయానికి వచ్చేసా.అంతే.కొందరు మనసులోవున్నా బయటకు వ్యక్తపరచక(లేక)పోవచ్చు.నాకు ఊహతెలిసినప్పటినుండీ "ఆమె"అంటే నాకీ భావనే కలిగింది.
అవును "ఆమె" ఎవరు?
ఎలావుంటుంది?
ఎత్తుగా వుంటుందా?
పొట్టిగా వుంటుందా?
తెల్లగా వుంటుందా?
నల్లగా వుంటుందా?
సన్నగా వుంటుందా?
లావుగా వుంటుందా?
మంచిగా వుంటుందా?
చెడ్డగా వుంటుందా?
ఎలా వుంటుంది "ఆమె"?
ఎలా గుర్తించాలి "ఆమె"ని,
పిచ్చాళ్ళామీరు "ఆమె"ని గుర్తించటానికి పై ఆనవాళ్ళు కావాలా?
తడి ఆరని చెక్కిలిపై జాలువారే 'కన్నీళ్ళే' "ఆమె" ఆనవాళ్ళు.ఇంకా కావాలా అందుకు ఆధారాలు. వాటికి కారణాలు ఏమైనా, అవి అమెతోనే పుట్టి ఆమె గుర్తింపుకు చిహ్నాలయ్యాయి. కాదంటారా?
అవును "ఆమె" ఎవరు?
ఎలావుంటుంది?
ఎత్తుగా వుంటుందా?
పొట్టిగా వుంటుందా?
తెల్లగా వుంటుందా?
నల్లగా వుంటుందా?
సన్నగా వుంటుందా?
లావుగా వుంటుందా?
మంచిగా వుంటుందా?
చెడ్డగా వుంటుందా?
ఎలా వుంటుంది "ఆమె"?
ఎలా గుర్తించాలి "ఆమె"ని,
పిచ్చాళ్ళామీరు "ఆమె"ని గుర్తించటానికి పై ఆనవాళ్ళు కావాలా?
తడి ఆరని చెక్కిలిపై జాలువారే 'కన్నీళ్ళే' "ఆమె" ఆనవాళ్ళు.ఇంకా కావాలా అందుకు ఆధారాలు. వాటికి కారణాలు ఏమైనా, అవి అమెతోనే పుట్టి ఆమె గుర్తింపుకు చిహ్నాలయ్యాయి. కాదంటారా?
Subscribe to:
Posts (Atom)